అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, అర్హులైన వ్యక్తులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో మంత్రి శ్రీనివాస్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెన్షన్ దారులు పెన్షన్ పంపిణీ సమయంలో గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని, వరుసగా మూడు నెలల పాటు గ్రామంలో అందుబాటు లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా ఆపేయడం జరుగుతుందని, తర్వాత కాలంలో వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి లేదా వీల్ చైర్ కు పరిమితమైన వారు పొందే పెన్షన్ లలోను, వికలాంగుల పెన్షన్లలో అనేకమంది అనర్హులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని పునఃసమీక్షించి, సంబందిత శాఖ అధికారులతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సెర్ప్ సీఈవో వీరపాండ్యన్, వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ,వార్డు సచివాలయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …