-జి. శ్రీదేవి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయాధికారి శ్రీమతి జి. శ్రీదేవి. తెలియ చేశారు. శుక్రవారం శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంధాలయము, రాజమహేంద్రవరం నందు 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవములను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకి ముఖ్య అతిథిగా డా కర్రి రామారెడ్డి హాజరయ్యారు.. ఈ ప్రదర్శనలో గ్రంథాలయంలో గల తాళ పత్రాలు, తామ్ర శాసనాలు, విలువైన గ్రంథాలను, చేతివ్రాత ప్రతులు మరియు వివిధ వ్యక్తుల జీవిత చరిత్ర పుస్తకాలు అందరికీ ఉపయోగపడే వివిధ పుస్తకాలను ఉంచడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రీ రామారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంధాలయాన్ని వినియోగించు కోవాలని, తద్వారా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాసం పుస్తక పఠనం ద్వారానే అలవడుతుందన్నారు. అందుచేత ప్రతి ఒక్కరు చదువు అనేది ఒక యజ్ఞంలా భావించాలని చదువు అనేది జీవితంలో ఒక భాగం కావాలని అందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేసారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరి బహుకరించిన అట్టలు గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు చదువుకునే విదార్థినీ విద్యార్ధులకు కర్రీ రామారెడ్డి గారి చేతులమీదుగా పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి జి.శ్రీదేవి, సిబ్బంది మరియు విధ్యార్ధినీ విద్యార్థులు పాఠకులు పెద్దసంఖ్య లో పాల్గొని విజయవంతం చేశారు.