Breaking News

ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు

-అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం
-మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరం తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఎపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ మేరకు జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఎపి ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండుపల్లి రాంప్రసాదర్ రెడ్డి, బిసి జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృతికాశుక్లా, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటి మద్రాసు డైరక్టర్ ప్రొఫెసర్ విజినాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారధి, ఎంజె శంకర్ రామన్ (సిఇఓ, ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్), ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల (మాజీ డీన్, ఐఐటిఎం కార్పొరేట్ రిలేషన్స్), ప్రొఫెసర్ రవీంద్రన్ (హెడ్, సెంటర్ ఫర్ రెస్పాన్సిబిల్ ఎఐ), రాజేష్ (ఐఐటిఎం అల్యూమినస్), చెన్నయ్ సిఎంఓ అధికారి రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

1. ఐఐటిఎం – ఎపి సిఆర్ డిఎ
అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటిఎం సంస్థ ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేస్తుంది.

2. ఐఐటిఎం – ఎపి మారిటైమ్ బోర్డు
సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటిఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతోపాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.

3. ఐఐటిఎం – ఎపి స్కిల్ డెవలప్ మెంట్
స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫారాల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఎపి స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

4. ఐఐటిఎం – ఎపి విద్యాశాఖ
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరుపార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఐఐటిఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ఎపిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటిఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.

5. ఐఐటిఎం – ఇన్వెస్టిమెంట్ & ఇన్ ఫ్రాస్ట్చక్చర్ శాఖ
విమానాశ్రయాలను లాజిస్టిక్స్ / మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టిసారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.

6. ఐఐటిఎం – ఐటి శాఖ
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడం. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం.

7. ఐఐటిఎం – ఆర్ టిజిఎస్ శాఖ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటిఎం ప్రవర్తక్ తో ఎపి ఆర్టీజిఎస్ కలసి పనిచేస్తుంది.

8. ఐఐటిఎం – క్రీడల శాఖ
అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటిఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *