Breaking News

రబీ పంటకు, మామిడి పంటకు భీమా

-అరటి, జీడి,మామిడి బోర్డుల ఏర్పాటుపై హర్షం
-రబీ పంటల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి
-ఎ.పి. రైతుసంఘం డిమాండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ పంటకాలంలోని రబీ సీజన్‌లోనే పంటలతోపాటు కొత్తగా మామిడి పంటకు పంటల భీమా అమలు చేస్తున్నట్లు మామిడి, అరటీ, జీడి పంటలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖామాత్యులు అచ్చెన్నానాయుడు ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ పంటలకు ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తూ రబీ పంటలకు రైతులే చెల్లించాలనడం సరికాదని రబీ పంలకు కూడా ప్రభుత్వమే భీమా ప్రీమియం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అదే విధంగా మామిడి, ఆరటి,జీడి పంటలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు కోరారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *