Breaking News

గృహ లబ్దిదారులతో సంఘాలు ఏర్పాటు చెయ్యండి

-లబ్దిదారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి
-ఆదివారం ఒకరోజు లబ్దిదారులు అర్జీలు పరిష్కారం కోసం అందుబాటులో ఉండాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా డిసెంబరు నెల చివరి నాటికి 2333 ఇళ్ల నిర్మాణ లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 306 (13 శాతం) పూర్తి చెయ్యడం జరిగిందని , మిగిలిన లక్ష్యాలు సాధించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం వెలుగుబంద హౌసింగ్ కాలనీ లో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పేద కుటుంబాల ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆప్షన్ 3వ కింద 3396 ఇళ్ళ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 683 పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పునాదుల స్థాయిలో 56 , బేస్ మెంటు పూర్తి చేసినవి 125 , మిగినవి వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. వారం వారం లక్ష్యాలను నిర్ణయించుకుని వాటినీ సాధించాల్సి ఉందన్నారు. గ్రూపులుగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి సమస్యలు తెలుసుకుని అనంతరం పరిష్కార మార్గాలను చూపాలన్నారు. లబ్ధిదారుల తో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. లబ్ధిదారులకు నాయకత్వ లక్షణాలు కల్పించడం లబ్దిదారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమిష్టి బాధ్యతతో సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. బిల్లుల చెల్లింపు కోసం జియో ట్యాగింగు సమస్య ఉందని, వారికి సరైన విధానంలో మార్గదర్శకం చేయాలన్నారు.

లబ్దిదారులు చిన్న జీవనోపాధి వృత్తులలో ఉండడం జరుగుతుందని, ఆదివారం ఒకరోజు లబ్దిదారులు అర్జీలు పరిష్కారం కోసం అందుబాటులో ఉండాలనీ కలక్టర్ ప్రశాంతి కోరడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో లబ్దిదారులు ఉండడం వల్ల మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది సహకారం అందించాలని ఇన్చార్జి హౌసింగ్ పిడి కె ఎల్ శివ జ్యోతి విజ్ఞప్తి చెయ్యగా, బిల్లులు చెల్లింపు తదితర అంశాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన దృష్ట్యా సమన్వయ బాధ్యతలు చేపట్టలన్నారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి హౌసింగ్ పిడి కె ఎల్ శివ జ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ బీవీ గిరి, ఇతర జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *