Breaking News

గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై మేధో మథనం

-జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో సమావేశం
-శాఖల వారి చేపట్టే పనులపై కమిటి ల వారీగాసమీక్ష
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా నియమించిన కమిటీ లు ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత కమిటీలు వారు చేపట్ట వలసిన కార్యాచరణపై కలెక్టర్ పి. ప్రశాంతి, జేసీ చిన్నరాముడు, మున్సిపల్ కమీషనర్ కేతన్ గార్గ్, డి ఆర్ ఒ సీతారామ మూర్తితో కలసి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి శాఖల వారీగా చేపట్టే పనుల ప్రాధాన్యతా క్రమంలో సంబంధించి ఒక్కొక్క కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ట్రాఫిక్, హెల్త్ అండ్ శానిటేషన్, హెల్త్, ఫుడ్ కమిటీ, సర్వేలెన్స్ కమిటీ, పబ్లిక్ ట్రాన్స్ఫార్ట్, పుష్కర్ నగర్ కమిటి, డిజాస్టర్ కమిటీ, ఎన్ జి ఒ, పర్యాటక సాంస్కృతిక కమిటి, ప్రోటోకాల్, ఎగ్జిబిషన్, చైల్డ్ అండ్ లేబర్ కమిటి, టెలి కమ్యూనికేషన్ కమిటిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కమిటీలు చేపట్టే ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ను సమగ్రంగా సిద్ధంచేయాలని ఆదేశించారు.

రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీ ల పరిధిలో మునిసిపల్ శాఖల అధికారులు, కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీవోలు రూరల్ ప్రాంతాలలో చేపట్ట వలసి అంశాల పై ప్రెజెంటేషన్ సిద్ధంచేయాలన్నారు. ట్రాఫిక్ కమిటి పై సమీక్షిస్తూ గత పుష్కరాలు కంటే పాపులేషన్, ట్రాఫిక్, వాహనాలు పెద్ద ఎత్తున సుమారుగా పది రెట్లు పెరిగాయన్నారు. అందుకు తగ్గట్టు గా ట్రాఫిక్ , రైల్వే ,  బస్సు ప్రయాణికులు, అంతర్గత రహదారులు పుష్కరాలకు వచ్చే యాత్రికులను దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గట్టు కార్యాచరణ సిద్ధం చెయ్యాలన్నారు.

హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ 24/7 పుష్కరఘట్స్ లోను, రహదారులు శానిటేషన్ పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని, విధులు నిర్వహించేందుకు ఇతర ప్రాంతాలు నుంచి వారికి వసతి, ఫుడ్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

హెల్త్ కమిటీ పుష్కర్ ఘాట్స్ లో నోడల్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని, పిహెచ్ సి వైద్యులు, అంబులన్స్ లు, అత్యవసర మల్టి స్పెషాలిటీ హాస్పిటలకు ఏర్పాటు, యాత్రకులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యం చేసేలా మొబైల్ అంబులెన్సు సమగ్ర సమాచారం అందించాలన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు మంచి ఆహారాన్ని అందించే విధంగా ఫుడ్ కమిటీలు పని చేయాలని అందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

సర్వేలెన్సు కమిటీ చిన్నపిల్లలు, వృద్ధులకు సంబంధించిన సమాచారం, కావలసిన సీసీ కెమెరాలు, ఏ ఏ ప్రదేశాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనే అంశాలను మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రి, కొవ్వూరు మున్సిపల్ మున్సిపాలిటీ కార్యాచరణను రూపొందించాలన్నారు . పుష్కర్ ఘాట్స్ లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటే వచ్చిన యాత్రికులను రద్దీ తగ్గేవరకు వాహనాలను ఆపే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.

ప్రజా రవాణా కమిటీ పై సమీక్షిస్తూ గత పుష్కరాలు కంటే 2027 నిర్వహించే పుష్కరాలకు పుష్కర్ ఘాట్లకు ఏ రూట్ లో ఎన్ని బస్సులు నడుపుతారు. ప్రస్తుతం ఎన్ని బస్సులు ఉన్నాయి. ఇంకా ఎన్ని బస్సులు అవసరం అవుతాయని కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పర్యాటక సాంస్కృతిక  కమిటీ ద్వారా 2027 పుష్కరాల్లో బటర్ ప్లే గార్డెన్స్, టెంపుల్ టూరిజం, సంస్కృతిక కార్యక్రమాలు  భవిష్యత్తులో గుర్తుండే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. పుష్కర్ ఘాట్స్ లో ఆర్ అండ్ బి చేపట్టే అభివృద్ధి పనులు, పకృతి విపత్తుల కమిటీ చేపట్టే పనులు, ఎన్జీవో స్ కమిటీ, ప్రోటోకాల్, ఎగ్జిబిషన్, చైల్డ్ లేబర్, మొబైల్ హాస్పిటల్, టెలి కమ్యూనికేషన్, ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ నేషనల్ హైవే కమిటీలు చేపట్టే పనుల వివరాలను రూపొందించి ప్రజెంటేషన్ రూపంలో నివేదికలు ఇవ్వాలన్నారు.

జాతీయ రహదారులపై చేపట్టే ఫ్లైఓవర్, బ్రిడ్జిల నిర్మాణ పనులను ఆగష్టు 2027 పుష్కరాలు నాటికి పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాల నాటికి రహదారులతోపాటు, వీధిలైట్లు, త్రాగునీరు సరఫరాకు సంబంధించి గత పుష్కరాలకు బేరీజ్ చేసుకుని అందుకు తగ్గట్టుగా కార్యాచరణతో ప్రజెంటేషన్ సిద్ధం చేయాలన్నారు.

పుష్కర ఘాట్స్ కు వచ్చే  సాధారణ భక్తులకు, వీఐపీలకు ఘాట్ లకు వొచ్చే ట్రాఫిక్  నియంత్రించే విధంగా వేర్వేరు మార్గాలను కేటాయించాలన్నారు.  రైలు ప్రయాణం ద్వారా గోదావరి పుష్కర యాత్రకు వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని, ముందుగానే అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని, అవసరాన్ని బట్టి ధవలేశ్వరం వైపు నుంచే వచ్చే  ట్రాఫిక్ ను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల  రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా అధికారులు కమిటీలు సమన్వయంతో రద్దీ లేని పుష్కర ఘాట్స్ కు, రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం ద్వారా వచ్చే వారిని  తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన అన్ని కమిటీలు  గత అనుభవా లను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళిక తో  ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు.

సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, అడిషనల్ ఎస్పీ ఎల్ &ఒ ఏ. వి. సుబ్బారావు, డిటిఓ ఆర్. సురేష్, ట్రాఫిక్ డిఎస్పి ఎం వెంకటేశ్వర్లు, కొవ్వూరు ఇంచార్జి ఆర్డీవో రాజమండ్రి కేఎల్ శివ జ్యోతి, రాజమండ్రి ఆర్డిఓ ఆర్ కృష్ణ నాయక్, ఆర్ అండ్ బి  ఈ ఈ  ఎస్ వి బి రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ఎం. అజయ్ బాబు, ఎన్ హెచ్. ఎ ఐ జి. సాయినాధ్, జిల్లా టూరిజం అధికారి పి. వెంకటాచలం, డిసిహెచ్ఎస్ డా. ఎన్ .పద్మశ్రీ రాణి, డీఐపీఆర్వో శిహెచ్ శ్రీనివాస్, డీపీఆర్వో మున్సిపల్ కమిషనర్ నిడదవోలు టి ఎల్ పి ఎస్ ఎస్ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *