-కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈలో సెంటినీ సిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మొవ్వ పద్మ
-వైద్య రంగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు
-సెంటినీ సిటీ హాస్పిటల్లో రాష్ట్రంలోనే ఏకైక ప్రత్యేక పార్కిన్సన్స్ విభాగం
-సీఎంఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ తోట
-కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈకి 470 మంది వైద్యుల హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు సెంటినీ సిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మొవ్వ పద్మ తెలిపారు. సెంటినీ సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో, కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈ నిర్వహించారు. ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ తోట నేతృత్వంలో నగరంలోని ఫార్చూన్ మురళీ పార్క్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ మొవ్వ పద్మ మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య చికిత్సలను చేరువ చేసేందుకు ఈ సీఎంఈ దోహదపడుతుందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో.. న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలతో పాటు.. పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించిన అత్యాధునిక వైద్య చికిత్సల గురించి కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈలో సమగ్రంగా చర్చ జరిపారు. 470 మంది వైద్యులు పాల్గొన్న ఈ సదస్సులో వివిధ అంశాలపై సంబంధిత విభాగాల నిపుణులు ప్రసంగించారు. ఆధునిక చికిత్సా పద్ధతులు, చికిత్సల్లో ఎదురయ్యే సవాళ్ల గురించి నిపుణులు తమ ప్రసంగాల్లో వివరించారు. సీఎంఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ తోట నవీన్ మాట్లాడుతూ.. ఆధునిక చికిత్సా విధానాలు, నవీన ఆవిష్కరణల గురించి అధ్యయనం చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ సీఎంఈ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయని, పలు నూతన డాక్టర్ పద్మ తెలిపారు. నగరంలోని సెంటినీ సిటీ హాస్పిటల్స్ నందు అత్యాధునిక పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సా విభాగం అందుబాటులో ఉందని అన్నారు. రాష్ట్రంలోనే ఈ మొట్టమొదటి ప్రత్యేక చికిత్సా విభాగం ద్వారా పార్కిన్సన్స్ వ్యాధికి ఆధునిక చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. న్యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో ఆధునిక చికిత్సలతో పాటు.. పార్కిన్సన్స్ వ్యాధికి అత్యాధునిక శస్త్రవికిత్సా పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. నవీన ఆవిష్కరణలను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని డాక్టర్ నవీన్ తోట వెల్లడించారు. ఈ సీఎంఈలో సెంటినీ సిటీ హాస్పిటల్ చైర్మన్ మొవ్వ ఆనంద్, డైరెక్టర్ మొవ్వ విష్ణు తదితరులు పాల్గొన్నారు.