Breaking News

రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా

-రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు
-73373-59375 నెంబర్ తో ఇక సేవలు
-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 73373-59375 నెంబర్ ను ఇందుకు కేటాయించామన్నారు. ధాన్యం అమ్మదలచిన రైతులు నెంబర్ కు Hi అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు.
ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ తెలియచేశారు. “రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత… రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుంది. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాదరబందీ లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం… ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిమిలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ చేస్తోంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయ”ని పేర్కొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *