-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందే ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నగర కమిషనర్ సోమవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహించారు. నగర పరిధిలో గల వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆ సమస్య సంబంధించిన శాఖధిపతులకు పరిష్కారం అందించాలని ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు 16 ఫిర్యాదులను కమిషనర్ కు అందజేశారు. ఈ ఫిర్యాదులన్నిటికీ సత్వర పరిష్కారం అందించాలని, పునరావతం అవ్వకుండా చూసుకోవాలని, శాకాధిపతులు ఫిర్యాదులను దగ్గరుండి పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎస్ ఈ (ప్రాజెక్ట్ )పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ ) జి సృజన, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డాక్టర్ లత, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, బయాలజిస్ట్ సూర్య కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.