విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్తి పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామ/వార్డు సచివాలయాల వద్ద పేదలు సామూహిక అర్జీలు సమర్పించి, చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు జయప్రదంగా జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు; బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్; ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం, ఎర్రగుంటపల్లిలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ; కర్నూలు కలెక్టరేట్ వద్ద భారీ స్థాయిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, కర్నూలు జిల్లా పార్టీ కార్యదర్శి బి. గిడ్డయ్య; వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్; గుంటూరు నగరంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్; కృష్ణాజిల్లా గన్నవరంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేవీవి ప్రసాద్; అనంతపురంలో జిల్లా పార్టీ కార్యదర్శి సీ. జాఫర్; విశాఖపట్నంలో జిల్లా పార్టీ కార్యదర్శి ఎం పైడిరాజు; ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సామూహిక అర్జీల సమర్పణ కార్యక్రమాలు అత్యంత జయప్రదంగా జరిగాయి.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …