Breaking News

మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి బాధ్యతల స్వీకారం

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
మాదిగ కార్పొరేషన్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్ పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి సోమవారం తాడేపల్లి బైపాస్ రోడ్ లోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దళిత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టి, నా బిసి అంటూ దళితులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం దళితులను చంపిన వారిని అరెస్టు చేయకుండా కాలయాపన చేసింది అన్నారు. దళిత మహిళగా, ఎమ్మెల్యేగా అవమానం జరిగిన చోటే తనకు మళ్ళీ గౌరవాన్ని ఇచ్చారని ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *