Breaking News

విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు

-నేటికి 40 లక్షల మంది గ్యాస్ బుకింగ్
30 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ
-కావాలనే దీపం-2 పథకంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలు
-సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు-మంత్రి నాదెండ్ల మనోహర్
-అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
లబ్ధిదారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా వెలుగులు నింపాలని చూస్తుంటే..కొందరు మాత్రం అపోహల ద్వారా ప్రజల జీవితాలు అంధకారంలో మగ్గేలా చేస్తున్నారు.

సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా దీపం-2-పథకం 31 అక్టోబర్, 2024 న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లాలో దీపం పథకాన్ని ప్రారంభించారు.

ఏపీలో సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్.

రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 55 లక్షల మంది గ్యాస్ కార్డుదారులకు అర్హత ఉండేవిధంగా ఈ పథకం రూపొందించడం జరిగింది.

దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం …మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేయడం జరిగింది.

దీపం -2 పధకం క్రింద అర్హులైన కుటుంబాలు వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకూ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు.*

ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

ప్రతి ఏడాది ఏప్రిల్ – జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు

1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం
2) రైస్ కార్డ్,
3) చెల్లుబాటు అయ్యే ఆథార్ కార్డు
4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి…

ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *