Breaking News

తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టి.టి.డి. నిర్ణయం హర్షణీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చాను. నగర ప్రజల ఆకాంక్షను టిటిడి ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించాను. టిటిడి పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు ఛైర్మన్ బి.ఆర్.నాయుడు కి, పాలక మండలి సభ్యులకు, ఈవో  శ్యామలరావుకి అభినందనలు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *