గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని వారి నివాసాలకు తొలుత ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పస్టం చేశారు. మంగళవారం కమిషనర్ ఆదేశాల మేరకు బృందావన్ గార్డెన్స్ లోని గంటా పున్నయ్య చౌదరి 2019 నుండి నీటి పన్ను రూ.1,5,6,365 బకాయి చెల్లించనందుకు, సిపిటి రోడ్ లోని కొత్త కాలనిలో అనధికారికంగా ట్యాప్ కనెక్షన్ పొందిన నందిగామ కోటయ్య నివాసాలకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ని ఇంజినీరింగ్ సిబ్బంది తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పన్నుల చెల్లింపు కీలకమని, నగరంలోని పన్నుదార్లు సకాలంలో పన్ను చెల్లించి జిఎంసికి సహకరించాలన్నారు. పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉండే వారికి జిఎంసి నుండి అందించే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజి కనెక్షన్ తొలగించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ తొలగింపు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Tags guntur
Check Also
వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమే
-పైగా కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం సమంజసమేనా -రూ. 8540 కోట్లకు గాను 1400 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు -విధ్వంసాన్ని …