గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, డివైడర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పార్క్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఆటో నగర్ రోడ్, వై జంక్షన్ ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో డివైడర్లలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పార్క్ విభాగ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అలాగే ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, మొక్కల పెంపకంపై చర్యలు తీసుకోవాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. ప్రదానంగా జాతీయ రహదార్ల వెంబడి వ్యర్ధాలు వేసే వారిని గుర్తించదానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు తెలిపారు. పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి మల్లికార్జున, ఏడిహెచ్ శ్రీనివాసరావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు
-జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం – సమ్మె విరమణ -తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి -ఆహారం,పౌరసరఫరాల మరియు …