Breaking News

గుజరాత్‌లోని పలు కీలక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో రైల్వేకి చెందిన పలు కీలకమైన జాతీయ ప్రాజెక్టులను 16 జులై 2021 తేదీన వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆయన ఇదే కార్యక్రమంలో గుజరాత్‌ సైన్స్‌ సిటీలో అక్వాటిక్స్‌, రోబోటిక్స్‌ గ్యాలరీ మరియు నేచర్‌ పార్కును కూడా ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టులలో పునరాభివృద్ధి పరిచిన గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వే స్టేషన్‌, మహేసన`వార్ధ లైన్‌ గేజ్‌ మార్పిడి మరియు విద్యుదీకరణ మరియు సురేంద్రనగర్‌`పిపావావ్‌ సెక్షన్‌ నూతన విద్యుదీకరణ ఉన్నాయి. ప్రధాన మంత్రి రెండు రైళ్లను, గాంధీనగర్‌ క్యాపిటల్‌`వారణాసి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మరియు గాంధీనగర్‌ మరియు వార్ధ మధ్య మెము సర్వీసు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు.
గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి…
గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వే స్టేషన్‌ రూ.71 కోట్ల నిధులతో అభివృద్ధి చేయబడిరది. స్టేషన్‌లో ఆధునిక ఎయిర్‌ పోర్టులతో సమానంగా ప్రపంచ స్థాయి వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. వికలాంగులపై ప్రత్యేక దృష్టితో వారి కోసం ప్రత్యేకంగా టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌, ర్యాంపులు, లిఫ్టులు డెడికేటడ్‌ పార్కింగ్‌ స్థలం మొదలైనవి ఏర్పాటు చేయబడినాయి. స్టేషన్‌ భవనం మొత్తం గ్రీన్‌ బిల్డింగ్‌ రేటింగ్‌ లక్షంగా డిజేన్‌ చేయబడిరది. స్టేషన్‌ ముఖభాగంలో రోజు వారిగా ప్రత్యేక లైటింగ్‌ కోసం 32 థీమ్స్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. స్టేషన్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కూడా కలిగింది.
మహేసన`వార్ద గేజ్‌ మార్పిడి మరియు విద్యుదీకరణ బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ (వాద్‌నగర్‌ స్టేషన్‌తో సహా)
55 కిమీల మహేసన`వార్ద గేజ్‌ మార్పిడి రూ.293 కోట్ల వ్యయంతో పూర్తి చేయబడిరది. ఇందులో రూ. 74 కోట్లతో విద్యుదీకరణ పనులు జరిగాయి. ఇందులో నూతనంగా అభివృద్ధి చేసిన విస్‌నగర్‌, వాద్‌నగర్‌, కేర్‌లు, వార్ద నాలుగు స్టేషన్లతో పాటు మొత్తం పది స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన స్టేషన్‌ వాద్‌నగర్‌. దీన్ని వాద్‌నగర్‌`మోదేర`పటన్‌ హెరిటేజ్‌ సర్కూట్‌ కింద అభివృద్ధి చేయబడిరది. వాద్‌నగర్‌ స్టేషన్‌ భవనం రాతి శిల్పాలతో సౌందర్యంగా నిర్మించబడిరది. సర్కులేటింగ్‌ ఏరియాలో ల్యాండ్‌స్కాపింగ్‌ ఏర్పాటు చేయబడిరది. వాద్‌నగర్‌ ఇప్పుడు బ్రాడ్‌ గేజ్‌ లైన్‌తో అనుసంధానించబడిరది. ఈ సెక్షణలో ఇప్పుడు ప్రయాణికుల రైళ్లు మరియు గూడ్స్‌ రైళ్లు నిరాటంకంగా సాగుతాయి.
సురేంద్రనగర్‌`పిపావావ్‌ సెక్షన్‌ విద్యుదీకరణ…
ఈ ప్రాజెక్టు రూ.289 కోట్ల వ్యయంతో పూర్తి చేయబడిరది. ఈ ప్రాజెక్టుతో పాలన్‌పూర్‌, అహ్మదాబాద్‌ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి పిపావావ్‌ పోర్టు వరకు ట్రాక్షన్‌ మర్పు లేకుండా నిరాటంకంగా సరుకు రవాణా రైళ్లు పయనింవచ్చు. లోకో చేంజ్‌ ఓవర్‌ కోసం వేచిఉండాల్సిన అవసరం లేని కారణంగా అహ్మాదాబాద్‌, విరామ్‌గామ్‌ మరియు సురేంద్రనగర్‌ యార్డులలో రద్దీ తగ్గుతుంది.
ఆక్వాటిక్స్‌ గ్యాలరీ…
ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో ఉండే వివిధ జాతుల మత్స్యాలను సేకరించి చూపరులకు ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఇందులోని ప్రధాన ట్యాంక్‌లో ప్రపంచంలోని ప్రధాన షార్క్‌లు ఉన్నాయి. కాలిబాట మార్గంలో 28 మీటర్ల పొడవు గల సొరంగం లాంటి ఏర్పాటు వినూత్న అనుభూతిని కలిగిస్తుంది.
రోబోటిక్స్‌ గ్యాలరీ….
రోబోటిక్‌ టెక్నాలజీతో ఇంటరాక్టివ్‌ గ్యాలరీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రోబోటిక్స్‌ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి సందర్శకులకు ఇది ఒక వేదికగా ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద రోబోట్‌ భారీ ప్రతిరూపం ఏర్పాటు చేశారు. మానవులతో రోబోటు ప్రతి స్పందన, భావోద్వేగలను ప్రదర్శించడం వంటివి ఆశ్చర్యకరంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. గ్యాలరీలోని వివిధ అంతస్తులతో వైద్యం, వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ మరియు రోజువారి ఉపయోగించే వంటి పలు రకాల రోబోటులు ఏర్పాటు చేశారు.
నేచుర్‌ పార్క్‌…
ఈ పార్కులో పొగ మంచుతో కూడిన గార్డెన్‌, చెస్‌ గార్డెన్‌, సెల్ఫి పాయింట్లు, శిల్పాల పార్కు మరియు చిట్టడవి వంటి అనేక రకాలున్నాయి. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా రూపకల్పనతో డిజైన్‌ చేశారు. మముత్‌, టెర్రర్‌ పక్షి, సింహం వంటి రూపాలతో అనేక జాతులను శాస్త్రీయ సమాచారం అందజేసేలా ఏర్పాటు చేశారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *