కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 19 వ తేదీన ముదినేపల్లి మండలంలో జరిగే రైతు చైతన్య యాత్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి మండల నాయకులు కృషి చేయాలని కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కోరారు. గురువారం కైకలూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముదినేపల్లి మండల పార్టీ అధ్యక్షులు బొర్రా శేషుబాబు, ఎంపీపీ అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 9 వ తేదీనుండి 23 వ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రల్లో భాగంగా ముదినేపల్లి మండలంలో ఈ నెల 19 వ తేదీన జరిగే కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వేంకటేశ్వర రావు(నాని)లతో పాటుగా జిల్లా కలెక్టర్ జె. నివాస్, జాయింట్ కలెక్టర్ మాధవిలత,వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి. మోహనరావు మరియు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటున్నారని అన్నారు. ముదినేపల్లి మండలం లోని సింగరాయపాలెం నుండి రైతు చైతన్య యాత్ర బొమ్మినంపాడు వరకు సాగి అక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యవసాయ శాఖ ఎగ్జిబిషన్ ను తిలకించి హాజరైన రైతులతో సమావేశం ఉంటుందని అన్నారు.
ముఖ్యంగా గ్రామాల్లోని రైతులు హాజరయ్యే విధంగా మండల నాయకులు ఆయా గ్రామాల నాయకుల్ని సమాయత్థ పరచి విజయవంతం చేయడానికి ద్రుష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అచ్చుత రాంబాబు, సాక్షి సాయిబాబు, కోమటి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags kaikaluru
Check Also
వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 13, 2024 శుక్రవారం నాడు …