Breaking News

కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించిన ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం బందరు మండలం కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది పనితీరు పరిశీలించి అర్జీల పరిష్కరం వాటి పరిస్థితి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ బికె, సచివాలయం వెల్నెస్ సెంటర్ల భవనాల నిర్మాణ ప్రగతి పరిశీలించారు. రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ కార్యక్రమం పరిశీలించినట్లు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు గృహనిర్మాణానికి ఎంత మంది ముందుకు వచ్చారు తదితర అంశాలపై పరిశీలించినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యలు పరిష్కారం, రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు, కోవిడ్ నివారణకు ఫీవర్ సర్వే ప్రగతి పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి జ్వరంతో బాధ పడుతున్న వారు కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు. సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ హాజరును పరిశీలించారు.

బందరు డివిజన్లో రేపటి నుండి పియంజికెవై క్రింద ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం : ఆర్డివో
బందరు డివిజన్లో రైస్ కార్డుదారులకు రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వ పధకం పియంజికెవై క్రింద రైనికార్డులో ఒకొక్కరికి 5 కేజిల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించనున్నట్లు బందరు ఆర్ డివో ఎస్ఎస్పి ఖాజావలి వెల్లడించారు.
వినియోగదారుడు చౌకధరల దుకాణాల వద్దకు వెళ్లి ఉచిత రైస్ పొందవలసిందిగా ఆర్ డివో కోరారు. బియ్యం పంపిణీ వాహనాల ద్వారా కాకుండా చౌకధర దుకాణాల వద్దనే బియ్యం పంపిణీ జరుగుతుందని వినియోగదారులు ఈ విషయం గమనించాలని కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల వాలంటీర్లు వినియోగదారులకు ఈ విషయం తెలియజేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *