అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్… ఇది చారిత్రాత్మక నిర్ణయం…

-ఉద్యోగాలతో పాటు విద్యారంగంలో కూడా రూ. 8 లక్షలు వార్షికాదాయ పరిమితి వర్తింపు…
-సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం…
-వ్యవసాయశాఖామంత్రి కన్నబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిజర్వేషన్ సౌకర్యం లేని అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి వర్తిస్తుందన్నారు.
గురువారం విజయవాడ లోని ఆర్లాండ్ బి భవన సముదాయంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి, ఇప్పటివరకూ రిజర్వేషన్ అందని అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాబోయే ఉద్యోగ నియామకాల్లో ఇడబ్ల్యుసి రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి సబ్ కా విభజన లేకుండా అత్యధికమందికి మేలు జరి గేలా న్యాయనిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని జి.ఓ.ను రూపొందించామని మంత్రి తెలిపారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో కేంద్రం నిబంధనలను మార్పు చేశారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు పరిమితం చేయడం జరిగిందన్నారు. ఉద్యోగనియామకాలతో పాటు విద్యాపరమైన సీట్ల రిజర్వేషన్లో అగ్రవర్ణ విద్యార్ధులకు రూ. 8 లక్షల వార్షికాదాయాన్ని నిర్దేశిస్తూ మరో ఉత్తర్వులను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇడబ్ల్యుయస్ రిజర్వేషన్లు పై గందరగోళం సృష్టించిందన్నారు. గత ప్రభుత్వ తీర్మానాలపై కేంద్రం లేఖలు వ్రాసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకో లేదన్నారు. ఇడబ్ల్యుయస్ రిజర్వేషన్లకు సంబంధించి అనేకమంది కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగిందని మంత్రి తెలిపారు. కాపులను యఫ్ కేటగిరిలో నమోదు చేస్తూ రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్రాసి మరల కాపులకు ఇడబ్ల్యుయస్ క్రింద 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరతీసారన్నారు. కాపులను అప్పటి ప్రభుత్వం ఏవిధంగా మోసం చేసిందో ఇడబ్ల్యుయస్ రిజర్వేషన్లో ఉదాహరణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అధికారిక బాధ్యతలను చేపట్టిన వెంటనే కోర్టుల్లో ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ పరిధిలో అగ్రవర్ణ పేదలు నష్టపోకుండా న్యాయనిపుణులతో సంప్రదించి నిబద్ద తగల స్పష్టమైన జి.ఓ.ను విడుదల చేయడం ద్వారా అగ్రవర్ణ పేదలకు న్యాయం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులతో కాపులతో పాటు అగ్రవర్ణాలకు రిజర్వేషన్‌ను అమలు చేస్తామన్నారు. అన్ని వర్గాలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి గౌ. వై.యస్. జగన్మోహన రెడ్డి సంకల్పమని రాష్ట్ర మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏవిషయంలోనూ రాజీపడబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. రాష్ట్రానికి చెందిన నీటివాటా హక్కులను వినియోగించుకోవడానికి ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి వివరించారు. పోలవరం నిర్వాసితులకు ఎటువంటి అన్యాయం జరగబోదని తమ ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయంచేసేలా అడుగులు ముందుకు వేస్తుందని తెలిపారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసే విషయంలో ముఖ్యమంత్రి గౌ. వై.యస్. జగన్మోహన రెడ్డి ధృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. ప్రజాసంక్షేమం, రాష్ట్ర సౌభాగ్యం కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు.

Check Also

ప్రధానమంత్రి విశ్వ కర్మ పథకం ఒక వరం…. సద్వినియోగం చేసుకోండి

-ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం 500 సెంటర్లలో గౌరవ ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *