పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 23, 24 తేదీలలో ఓటర్ల జాబితా సవరణ కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం -2025లో భాగంగా గత అక్టోబర్ నెల 29వ తేదీన సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని, అందులో ఏమైనా అభ్యంతరాలు గాని, క్లేయిములు గాని చేయదలచుకున్న ఈనెల 28వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలో కొత్తగా ఓటర్లుగా పేరు నమోదు చేయడానికి, చిరునామా లేదా ఇతర చేర్పులు మార్పులు చేయడానికి బూత్ స్థాయి అధికారులు దరఖాస్తు పత్రాలు 6,7,8 స్వీకరించడం జరుగుతుందన్నారు. అర్హత గల ఓటర్లు అనగా 18 సంవత్సరాలు నిండిన లేదా 1-1-2025 తేదీ నాటికి 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చే భావి ఓటర్లను ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. రాజకీయ పార్టీలు వారి బూత్ స్థాయి ఏజెంట్లను కూడా ప్రత్యేక శిబిరాలలో భాగస్వాములు చేయాలన్నారు.

.ఆ విధంగా వచ్చిన క్లేయిములు, అభ్యంతరాలను వచ్చే డిసెంబర్ నెల 24వ తేదీ లోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. వచ్చే జనవరి 1 వ తేదీన ఓటర్ల జాబితాను అన్ని విధాల పరిశీలించడం జరుగుతుందన్నారు. డేటా బేస్లు తాజా సమాచారంతో రూపొందించి చివరి ప్రచురణకు ఎన్నికల సంఘం అనుమతి కోరడం జరుగుతుందన్నారు.
అనంతరం వచ్చే జనవరి 6వ తేదీన ఫోటో ఓటర్ల జాబితా చివరి ప్రచురణను ప్రకటించడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు జిల్లాలో 15,38,938 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 7,45,775 మంది పురుషులు కాగా 7,93,108 మంది స్త్రీలు, 55 మంది ఇతరులు ఉన్నారన్నారు. ఈసారి ఓటర్ల జాబితా చాలా పక్కాగా స్వచ్ఛంగా తయారు కాబోతుందన్నారు. ఓక ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలోనే ఉండే విధంగా ఓటర్ల జాబితా సిద్ధం చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న సంవత్సరాలు కూడా సవరిస్తూ చేయగలిగితే వచ్చే సాధారణ ఎన్నికలు ఇంకా చాలా బాగా నిర్వహించవచ్చని నమ్మకంగా చెప్పారు.

ఫారం 9, 10, 11 అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశామని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు.
ఈనెల 9, 10 తేదీలలో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో కొత్తగా 372 దరఖాస్తులు అందాయన్నారు.

కృష్ణా గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈనెల 1 వ తేదీ అర్హత దినంగా పరిగణిస్తూ దరఖాస్తులు ఈనెల 6వ తేదీ వరకు స్వీకరించడం జరిగిందన్నారు. ఆ ప్రకారం ఆన్లైన్లో 48,019 దరఖాస్తులు, ఆఫ్ లైన్ లో 13,168 దరఖాస్తులు కలిపి మొత్తం 61,187 దరఖాస్తులు అందాయన్నారు. ఇంకా 429 ఫారం 18 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని ఈరోజు పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటికి అదనంగా మరో 21 పోలింగ్ యంత్రాలు కలుపుకొని మొత్తం 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1000 ఓట్లకు మించకుండా ఉండే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నామని, ఈ నెల 23వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని, అప్పటినుండి వచ్చే డిసెంబర్ నెల 9వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు గాని, క్లేయిములు గాని స్వీకరిస్తామన్నారు. వచ్చే డిసెంబర్ నెల 25వ తేదీ లోగా అన్ని అభ్యంతరాలు, క్లేయిములు పరిష్కరించి వచ్చే డిసెంబర్ నెల 30వ తేదీన ఓటర్ల జాబితా చివరి ప్రచురణ చేస్తామన్నారు.
రాజకీయ పార్టీలు వారి తరఫున బూతు స్థాయి ఏజెంట్లను నియమించుకుని వారీ వివరాలను అందజేయాలన్నారు.

ఈ సందర్భంగా బీఎస్పీ ప్రతినిధి బాలాజీ మాట్లాడుతూ హిందూ, హైని విద్యాసంస్థల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో 2000 కు మించి ఓటర్లు ఉన్నారని వాటిని ఇతర పోలింగ్ కేంద్రాలకు మార్చాలన్నారు

దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్డిఓ కు సూచించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, షారోన్, బిజెపి సిపిఎం, బీఎస్పీ వైఎస్ఆర్సిపి ప్రతినిధులు పంతం వెంకట గజేంద్రరావు, కొడాలి శర్మ, బాలాజీ, షేక్ సలార్ దాదా, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి లక్ష్మీనారాయణ, సాంకేతికులు సుధా తదితరులు పాల్గొన్నారు.

Check Also

చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి

-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *