Breaking News

శెట్టిపల్లి భూ సమస్యలకు త్వరిత గతిన పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శెట్టిపల్లి భూ సమస్య లకు త్వరిత గతిన పరిష్కారo చేసేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. బుదవారం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ తో కలిసి శెట్టిపల్లి భూ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శెట్టిపల్లి భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. శెట్టిపల్లి లబ్ధిదారులకు ఎంత మందికి భూములు కేటాయించాలని దానిపై ఇవ్వాలనే లేఔట్ మ్యాప్ తయారు చేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కావున శెట్టిపల్లి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర పాలక మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్, తాసిల్దార్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *