ఎమ్మెల్సీ ఎన్నికల విధులు బాధ్యతలు పై శిక్షణ

-అక్టోబరు 5 వ తేదీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి జిల్లాలో 20 పోలింగు కేంద్రాల ఏర్పాటు
-కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే మార్గదర్శకా లను ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి శిక్షణ సామాగ్రి పై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏఆర్వో, సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పొలింగ్ రోజున విధులు నిర్వహించే విధి విధానాలు పై శిక్షణ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా కలెక్టరు ప్రశాంతి, డీ ఆర్వో టి సీతారామ మూర్తి లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లడుతూ, ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది నిర్వహించే విధులపై స్పష్టమైన అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. సార్వత్రిక ఎన్నికల విధానంలో ఈ వి ఎమ్ యంత్ర పరికరాలతో కాకుండ, బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫారం 16 ద్వారా ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల విధుల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే క్రమంలో బాధ్యతలు ఉంటాయన్నారు. ఫారం నెంబర్ లలో మార్పు తప్ప ఒకే విధంగా భర్తీ చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో అనుభవం ఉన్న వారినే పోలింగ్ కేంద్రాల విధుల్లో నియమిస్తున్నట్లు తెలిపారు. సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ల కు అవగాహనా కల్పించడం, ఓటరు స్లీప్ మడత పెట్టడం పై తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఇన్వాలిడ్ ఓటు లేకుండా చూడడం సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఓటు లెక్కింపు ప్రక్రియ ఉంటుందని కలెక్టరు తెలియ చేశారు.

మొదటి పొలింగ్ అధికారి విధులు, బాధ్యతలు, సవాల్ ఓటు , టెండర్ ఓటు , అంధుల నిస్సహాయ ఓటు వేసే విధానంలో అవగాహన కల్పించడం జరిగింది. బ్యాలెట్ బాక్సు, బ్యాలెట్ పేపర్, మార్క్డ్ కాపీ, పేపర్ సీల్, మెటల్ సీల్, రబ్బర్ స్టాంప్, ఫారం 14, 15 , 16 పై అవగాహన కల్పించడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి వేరే వేరే మార్గాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఈ శిక్షణా తరగతులకి ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి ఎమ్. మాధురీ, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి

-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *