-ఓపెన్ రిచ్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర వంగలపూడి -1 రూ. 67.59 , వంగలపూడి -2 రూ.70.19 లుగా నిర్ణయం
-ఓపెన్ రీచ్ ల వద్ద రూ.270 నుంచి రూ.300 లకు అమ్మడం పై ఫిర్యాదు
-వినియోగదారుడికి మార్గదర్శకాల మేరకు మాత్రమే త్రవ్వకాల చెల్లింపు చార్జీలు వసూలు జరపాలి
-నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది
-ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అటువంటి వారి అనుమతులు రద్దు చెయ్యడం జరుగుతుంది
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజమహేంద్రవరం / సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
మెసర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వారికి నవంబర్ 11 వ తేదీన ఆరు నెలలు కోసం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చెయడం జరిగిందన్నారు. వాస్తవంగా నవంబర్ 11 2024 నుంచి మే 10 2025 వరకూ రీచ్ వద్ద లావాదేవీల విషయంలో ఇచ్చినటి వంటి అనుమతులు తక్షణం రద్దు చెయ్యడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ , ఇతర అధికారులు, బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు ఉన్నారు