Breaking News

ఏపీఐఐసీ కాలనీలోని కామన్‌ స్థలం రెగ్యులైజేషన్ కి కృషి చేస్తాం : ఎంపీ కేశినేని శివనాథ్

-4వ డివిజ‌న్ లో ప‌ర్య‌టించిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె , ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీ వాసుల కామన్‌ సైట్‌ రెగ్యులైజేషన్‌ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పానబాక రచన తో కలిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం ప‌ర్య‌టించారు. ఏపీఐఐసీ కాల‌నీలోని ఎమ్.ఐ.జీ, ఎల్.ఐ.జి, ఈ.డ‌బ్ల్యు.ఎస్ సెక్టార్స్ లోని సెట్ బ్యాక్ స‌మ‌స్య ను వీరంతా స్వ‌యంగా ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీవాసుల కామన్‌ సైట్‌ రెగ్యులైజేషన్‌ సమస్య గురించి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మొదటి నుంచి కృషి చేస్తున్నారని చెప్పారు. 1976 సంవత్సరంలో ఈ కాలనీ నిర్మాణం చేశారని చెప్పారు. కాలనీలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపై ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, తాను కాలనీలోని పెద్దలు గత కొన్ని రోజులుగా చర్చిస్తున్నామని చెప్పారు. ఆటోనగర్‌లోని చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు, పనిచేసే వారు స్థలాన్ని కొనుగోలు చేసి చిన్నపాటి ఇళ్ళను నిర్మాణం చేసుకున్నారు. స్థలంలో ఉన్న ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేశారే కాని కామన్‌ సైటును రిజిస్ట్రేషన్‌ చేయలేదన్నారు. ఈ సమస్యను తమ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరించి ఎ.పి.ఐ.ఐ.సి కాలనీ వాసులకు న్యాయం చేస్తుందన్నారు. ప్రజా సమస్యలను మనవతా దృక్పధంతో ఆలోచించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమకు ఎప్పుడూ చెబుతుంటారని తెలిపారు. ఈ సమస్యకు అతి త్వరలోనే శాశ్వత పరిష్కారం తమ ప్రభుత్వం చూపుతుందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఈ కాలనీ 50 సంవత్సరాల క్రితం ఏర్పడిన లే-అవుట్‌ అన్నారు. మూడు విభాగాలుగా ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారని, అప్పుడు ఉన్న అధికారులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా నామమాత్రంగా ఆలోచనలు చేయడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. ఇక్కడ ఉన్న పది ఎకరాల స్థలానికి 405 కుటుంబాల వారు డబ్బులు సమకూర్చుకుని ప్రభుత్వానికి చెల్లించారన్నారు. నిర్మాణం చేసిన స్థలాన్ని మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేశారే కాని కామన్‌ సైటును రిజిస్ట్రేషన్‌ చేయలేదన్నారు. దాని వల్ల ఇంటిని మరమ్మతులు చేయాలనుకున్నా, ఇంటిని పడగొట్టి మళ్ళీ నిర్మాణం చేయాలనుకున్నా సాధ్యం కావడం లేదన్నారు. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి ఏపీఐఐసీ ఛైర్మన్‌ రామరాజును స్వయంగా వచ్చి పరిశీలించమని కోరడంతో ఆయన వెంటనే వచ్చారన్నారు. ఇక్కడ ఉన్న సమస్యను స్వయంగా ఆయనే పరిశీలించారని త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని గతంలోనే తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. అతి త్వరలోనే ఈ సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించి ఎపీఐఐసీ కాలనీ వాసులకు శుభవార్త చెబుతామని అన్నారు.

ఇక‌ ఏపీఐఐసీ ఛైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితం మూడు విభాగాలుగా చేసి 405 ఇళ్ళ నిర్మాణాన్ని చేసుకున్నారని చెప్పారు. ఈ కాలనీలో ఉన్న కామన్‌ సైట్‌ రెగ్యులైజేషన్‌ సమస్యను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. స్వయంగా వచ్చి సమస్య గురించి తెలుసుకునట్లు చెప్పారు. ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేసి 50 సంవత్సరాలు అవుతున్నందువల్ల ఇంటిని రిపేర్లు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉందన్నారు. వర్షం వస్తే మూడు అడుగుల మేర నీరు నిల్వ ఉంటున్నాయని నివాసితులు చెప్పారన్నారు. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని రామరాజు హామీ ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్పోరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, ఐలా మాజీ ఛైర్మన్‌ సుంకర దుర్గాప్రసాద్, యువ‌నాయ‌కుడు గ‌ద్దె క్రాంతి కుమార్, టిడిపి నాయ‌కులు గొల్లపూడి నాగేశ్వరరావు, కోడూరు ఆంజనేయ వాసు, కాల‌నీ ప్రెసిడెంట్ పాతూరి సాంబ‌శివ‌రావు ,కాల‌నీ వాసులు రెడ్డి రాంబాబు, అబ్థుల్‌ కలాం, జీ.అయ్యప్పరెడ్డ, మన్యం పోతురాజు,ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ బాజ్జి, ఏపిఐఐసీ చీఫ్ ఇంజనీర్ కే.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *