Breaking News

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం
-క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఔట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరాము. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా విధులు నిర్వహిస్తున్నాము. విధుల్లో చేరిన నాటి నుంచి వేతనాలు లేవు. అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నాము. మేము పని చేసిన కాలానికి జీతాలు ఇప్పించండి సార్. ఉద్యోగ భద్రత కల్పించండి’ అంటూ గత నెలలో మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్  సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడం పట్ల మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను నాలుగు వారాలలోపు పరిష్కరించినందుకు పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటామన్నారు.

Check Also

గొప్ప మనసు చాటుకున్న మంత్రి దుర్గేష్ అంటూ ఆనందం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం

-మంత్రి కందుల దుర్గేష్ అందించిన ఆర్థిక సాయం వెలకట్టలేనిదంటూ పేర్కొన్న బాధిత కుటుంబం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *