విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కల్పిస్తే మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో సహాయ పడుతుందని ఉద్దేశంతో, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో అన్ని శాఖల్లోని గుమస్తాలు, సూపరిండెంట్లకు, ఈ ఆర్ పి (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) లో కౌన్సిల్ నిర్వహణ లో వాయిస్ లోని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చే శిక్షణ కార్యక్రమం ను గురువారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు కౌన్సిల్ ప్రియంబుల్ ను, ఈ.ఆర్.పి ద్వారా ఎలా నిర్వహించాలి అన్న అంశంపై శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో గుమస్తులు, సూపరిండెంట్లు వారి వారికి వచ్చిన సందేహములను ఎక్స్పర్ట్స్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సెక్రటరీ వసంతలక్ష్మి, మేనేజర్ శర్మ, వివిధ శాఖల సూపరిండెంట్లు, గుమస్తాలు, పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …