పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మర్యాదపూర్వకంగా కలిసారు. ఏపిలో మూడు పార్టీల పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చేసిన కృషికి సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో దుష్టపాలనని అంతమొందించి, ప్రజాప్రభుత్వం ఏర్పడటం కోసం జనసేన త్యాగాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పొత్తు కోసం తన సొదరుడు పోటీలో నుంచి వైదొలగాల్సి వచ్చినా సిద్ధపడిన పవన్ కళ్యాన్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. విజయవాడ …
Read More »Tag Archives: AMARAVARTHI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ( ఏ పి యస్ యస్ డి సి ) ఐఎస్ఓ గుర్తింపు సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యమయిందన్న నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రధాన కార్యదర్శి యస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించడం ద్వారా మరో మైలురాయి చేరామని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) 9001 – 2015 సర్టిఫికెట్ ను గ్లోబల్ మానేజ్మెంట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ …
Read More »స్కూళ్లకు వేసవి సెలవులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని.. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినంగా పేర్కొంది.
Read More »పిఠాపురం నియోజక వర్గంలో ఇంటింట ప్రచారానికి సన్నద్ధం
పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం టిడిపి ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో టిడిపి రూపొందించిన కరపత్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజక వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనే అంశంపై పవన్ కళ్యాణ్ నిబద్ధతతో చెప్పిన హామీలను ఇందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ప్రాంతం. జైన, బౌద్ధ, శైవ, …
Read More »వాలంటీర్లే రాజకీయ వారధులు!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడిరది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం. ఏభై కుటుంబాలకో వాలంటీర్. వాళ్ళ మంచీ చెడ్డా చూడడం అనే …
Read More »రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్టగా పని చేద్దాం… : పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మూడు పార్టీల సమన్వయంతో, పొత్తుల మీద ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయి. కానీ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పడిన జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీల పొత్తు విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరింది. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ లెక్క వేయలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన …
Read More »బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఆదివారం రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అడ్వాణీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో కీలక పాత్ర ఎల్‌కే అడ్వాణీ రాజకీయాల్లో ఏడు దశాబ్దలపైగా కీలకంగా పని చేసి …
Read More »ఎన్నికల విధులో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఇ.సి. నిర్ణయం
-ఎం.సి.సి. అమల్లో ఉన్నంత వరకూ ఎపిటెట్ ఫలితాలు, ఎపిటిఆర్టి పరీక్షలు వాయిదా -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఎపిటెట్ (APTET) ఫలితాలను వెలువరించ వద్దని మరియు ఎపిటిఆర్టి (APTRT) పరీక్షలను నిర్వహించవద్దని, వాయిదా వేయాలని కూడా ఎన్నికల …
Read More »రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వరుగా మరియు …
Read More »కదిరి ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
-రాష్ట్రాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు కదిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టు వద్ద పత్రికా విలేకరుల సాక్షిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. కదిరి ప్రజాగళం సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ… పులివెందులలో వైఎస్ వివేకాపై వేసిన గొడ్డలి వేటు శబ్ధం సమీపంలో ఉన్న కదిరికి వినిపించింది… వివేకాను ఎవరు, ఎందుకు, ఎలా …
Read More »