అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఆదివారం రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అడ్వాణీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజకీయాల్లో కీలక పాత్ర
ఎల్‌కే అడ్వాణీ రాజకీయాల్లో ఏడు దశాబ్దలపైగా కీలకంగా పని చేసి దేశానికి సేవలందించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘1927లో కరాచీ (ప్రస్తుతం పాక్లో ఉంది) జన్మించిన ఆయన 1947 దేశ విభజన సమయంలో భారత్కు వలస వచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేసినప్పుడు దాని నుంచి రక్షించడంలో కీలకంగా వ్యవహిరించారు’ అని ఎక్స్ వేదికగా తెలిపారు. 1977-1979 వరకు అడ్వాణీ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా పని చేశారు. 1986 – 1990, 1993- 1998, 2004 నుంచి 2005 వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
Prajavartha Online Telugu News