Breaking News

Tag Archives: AMARAVARTHI

నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు, డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు,ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ ల మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని అలాంటి మోసాలపట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ ఎస్.రావత్ పేర్కొన్నారు.బుధవారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 23వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకూ ఆన్లైన్ మోసాలు,నకిలీ చిట్ …

Read More »

రాష్ట్రమంత్రి పేర్నివెంకట్రామయ్యకు (నాని) అదనంగా సినిమాటోగ్రఫీ శాఖ కేటాయింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సంబంధాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పేర్నివెంకట్రామయ్యకు (నాని) రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలను కూడా కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వులు జిఓఎంఎస్ సంఖ్య 144 ద్వారా ఆదేశాలు జారీ చేసి రాజపత్రం (గెజిట్ నోటిఫికేషన్) జారీచేశారు.

Read More »

పొట్టి శ్రీరాములు 69వ వర్గంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి సందర్బంగా బుధవారం మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు  చిత్ర పటానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ ఐ.పి.ఎస్., పలువురు పోలీసు ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Read More »

సిఎస్ తో భేటీ అయిన తూర్పు నావికాదళం కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త(ఎవిఎస్ఎం,వైఎస్ఎం,విఎస్ఎం)ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మతో భేటీ అయ్యారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సిఎస్ డా.శర్మను వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఇరువురు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ భేటీలో తూర్పు నావికాదళం అధికారులు కెప్టెన్ విఎస్సి రావు,కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేధీ,కమాండర్ సుజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

సచివాలయ ఉద్యోగుల ప్రోబషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.పి.జె.ఎ.సి చైర్మన్, మరియు ఎ.పి.యన్.జి.ఓ స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి.శ్రీనివాస రావు సారథ్యంలో, గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ జైన్ ను కలిసి సచివాలయ ఉద్యోగుల ప్రోబషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎ.పి.జె.ఎ.సి మరియు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందచేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వెంటనే ప్రక్రియ పూర్తి చేసి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని 11పి.ఆర్.సి ని వర్తింపచేయాలని కోరుతూ ఇతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర …

Read More »

వల్లభాయి పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పూలు సమర్పించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, ఏపీ స్టేట్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుప్పం ప్రసాద్‌లు పాల్గొని నివాళులర్పించారు.

Read More »

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి…

-మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం  వైయస్‌.జగన్‌ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Read More »

పిఆర్సీపై కార్యదర్శుల స్థాయి కమిటీ సిఫార్సుల నివేదికను వివరించిన సిఎస్ డా.సమీర్ శర్మ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ నివేదికపై కార్యదర్శుల స్థాయి కమిటీ సిఫార్సులను సోమవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధ్యక్షతన గల కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది.అనంతరం సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో సిఎస్ డాక్టర్‌ సమీర్‌ శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ పిఆర్సీపై చేసిన సిఫార్సులను మీడియాకు వివరించింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పిఆర్సీపై తుది నిర్ణయాన్ని మూడు రోజుల్లోగా అనగా 72 గంటల్లో ముఖ్యమంత్రి …

Read More »

హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ డా.కె.మన్మధరావు,జస్టిస్ బిఎస్ భానుమతి ప్రమాణం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు గా నియమింపబడిన జస్టిస్ డా.కుంభాజడల మన్మధరావు,జస్టిస్ కుమారి బొడ్డుపల్లి శ్రీ భానుమతిలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.ఈమేరకు బుధవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇద్దరు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరాం,హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ ఎ.రవీంద్ర బాబు,ఎపి బార్ …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్‌ విరాళం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్‌ వెల్‌ఫేర్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి సీఎం జగన్‌కి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.వెంకట రాజారావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ …

Read More »