అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త(ఎవిఎస్ఎం,వైఎస్ఎం,విఎస్ఎం)ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మతో భేటీ అయ్యారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సిఎస్ డా.శర్మను వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఇరువురు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ భేటీలో తూర్పు నావికాదళం అధికారులు కెప్టెన్ విఎస్సి రావు,కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేధీ,కమాండర్ సుజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News