అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.పి.జె.ఎ.సి చైర్మన్, మరియు ఎ.పి.యన్.జి.ఓ స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి.శ్రీనివాస రావు సారథ్యంలో, గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ జైన్ ను కలిసి సచివాలయ ఉద్యోగుల ప్రోబషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎ.పి.జె.ఎ.సి మరియు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందచేశారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వెంటనే ప్రక్రియ పూర్తి చేసి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని 11పి.ఆర్.సి ని వర్తింపచేయాలని కోరుతూ ఇతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఎ.పి.జె.ఎ.సి తరపున రాష్ట్ర చైర్మన్ బండి.శ్రీనివాసరావు సారథ్యంలో ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి మరియు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. జాని పాషా మరియు రాష్ట్ర కమిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కు 10అంశాలతో కూడిన వినతి పత్రం అందించి 15నిముషాలపాటు అన్నీ అంశాలపై చర్చలు జరిపి అన్నీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కొరారు. సాధ్యమైనంత త్వరగా అన్నీ అంశాలు పరిశీలించి పరిష్కరిస్తామని గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వీటిలో జూలై 2019 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సచివాలయ ఉద్యోగులందరికీ 2021 అక్టోబర్2తేదీనాటికి రెండేళ్లు ప్రోబషన్ కాలం పూర్తి అయినందున వెంటనే ప్రోబేషన్ డిక్లేర్ చేసి పెస్కేల్ వర్తింప చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు వర్తింప చేయాలని, అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాల్లోకి వచ్చిన వివిధ శాఖల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎ.యన్.యమ్ లు వివిధ శాఖాపరమైన కారణాలతో విధుల్లో చేరడం ఆలస్యమైందని వారందరికీ 2019 అక్టోబర్2వ తేదినే అపాయింట్మెంట్ డేట్ గా పరిగణలోకి తీసుకోవాలని, సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని, కవిడ్-19 సందర్భంగా సెలవులు వినియోగించుకున్న ఉద్యోగులకు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులకు హాజరైనట్లుగా పరిగణించాలని, చనిపోయిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని, గ్రేడ్-5పంచాయతీ కార్యదర్సులకు సి.పి.టి తో సంభందం లేకుండా ఎ.పి.పంచాయతీ రాజ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ రూల్స్ 2010 ప్రకారం ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని, సచివాలయ ఉద్యోగులందరికీ జాబ్ చార్ట్ ఇంప్లిమెంట్ చేయాలని, జాబ్ చార్ట్ ప్రకారం విధులు అప్పగించాలని, మెటర్నిటీ లీవ్ తీసుకున్న మహిళా ఉద్యోగుల ప్రోబషన్ పీరియడ్ పొడిగించకుండా డ్యూటీ పీరియడ్ గా వర్తింపజేయాలని, సింగల్ టైం ఆప్షన్ ద్వారా గ్రామ,నుండి వార్డు వార్డు నుండి గ్రామ సచివాలయానికి మార్చుకొనేందుకు అవకాశం కల్పించాలని, స్లైడింగ్ ద్వారా ఒక పోస్ట్ నుండి మరో పోస్ట్ కు మారిన ఉద్యోగులకు మొదటి జాయినింగ్ తేదిని ప్రోబేషన్ డిక్లరేషన్ కు పరిగణలోకి తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కు వినతిపత్రం అందించి పలు అంశాలపై చర్చించడం జరిగింది.
యాంటిసిడెంట్ వెరిఫికేషన్ పూర్తి కాని సచివాలయ ఉద్యోగుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ కేసుల నుండి విముక్తి పొందిన వారి కి వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని,వినతిపత్రం అందించి, వికలాంగులకు మరియు 45సంవత్సరాలు పైబడిన సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి శాఖపరమైన పరీక్షలతో సంభందం లేకుండా ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా,ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణ ఫెడరేషన్ నాయకులు టి.సరస్వతిరావు, ఎం.శశిధర్, యస్.కె.సుభాని, బి. శ్వేత, యస్.కె.రహీం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News