Breaking News

Tag Archives: amaravathi

సచివాలయంలో ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం

– విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ కృషి – విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం – విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగంను నియంత్రించాలి – విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలి – గృహవినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపైన కూడా ఆకస్మిక తనిఖీలు – విద్యుత్ నష్టాలను తగ్గించడంలో విజిలెన్స్ కీలక పాత్ర – మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు – అన్ని జిల్లాల ఎస్పీలతో సంయుక్త సమావేశాలు – వ్యవసాయ మీటర్లపై ప్రతిపక్షాలది అనవసరపు రాద్దాంతం – మీటర్ల వల్ల …

Read More »

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితా రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రం, భువవగిరికి చెందిన పర్వతారోహకురాలు అన్విత రెడ్డి (24) 2022 మే 16న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పేరు గాంచిన అన్విత గ్రూప్ అనితర సాధ్యమైన ఈ సాహస యాత్రకు అవసరమైన శిక్షణకు అర్ధిక సహకారాన్ని అందించింది. అన్విత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ఈ గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన …

Read More »

నకిలీ ఎరువుల తయారీదారులపై వరుస దాడులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమంగా ఎరువులను తయారు చేస్తున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించే విధముగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టుచున్నది. సత్తుపల్లి ఎరువుల దుకాణాలలో పోటాష్ కు మారుగా ఇసుకకు రంగు కలిపి విక్రయిస్తున్న వారిని తెలంగాణ వ్యవసాయ అధికారులు, పోలీస్ వారు పట్టుకుని విచారించారు. దాని తయారీదారులు, విక్రయకారులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్లు తెలుసుకుని, మన రాష్ట్ర వ్యవసాయ శాఖ సిబ్బంది పోలీస్ వారి సహకారంతో వరుస దాడులు నిర్వహిస్తున్నారు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో 11. …

Read More »

ఎపి సిఎస్ డా.సమీర్ శర్మ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది.సిఎస్ డా.శర్మ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సిఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి డిఓ లేఖ వ్రాయడం జరిగింది.సియం విజ్ణప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎపి సిఎస్ డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు మాసాల పాటు అనగా …

Read More »

సబ్ ప్లాన్ నిధులు వృధా అయితే సహించేది లేదు

-ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసా ఎస్సీలకు చేరాల్సిందే -అధికారులకు స్పష్టం చేసిన మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో ఒక్క రుపాయి వృధా అయినా సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేసారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో ప్రతిపైసా కూడా ఎస్సీల అభివృద్ధికి ఉపయోగపడేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులమీదే ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఉప ప్రణాళికపై గురువారం జరిగిన …

Read More »

కాలుష్య కారక సంస్థలపై పూర్తి పర్యవేక్షణ

-కాలుష్య నియంత్రణ మండలి పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష -పరిశ్రమలకు అనుమతుల విషయంలో అనవసరపు జాప్యం వద్దు -పర్యావరణ పరిరక్షణ పద్దతులను ఖచ్చితంగా అమలు చేయాలి -అధిక కాలుష్యానికి కారణమయ్యే సంస్థలపై కఠిన చర్యలు -ఖచ్చితంగా పర్యవరణ హిత విధానాలను పాటించాల్సిందే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కాలుష్యంకు కారణమవుతున్న పరిశ్రమలు, సంస్థలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ద్వారా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, గనులశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో …

Read More »

జలవనరులశాఖపై సీఎం జగన్‌ సమీక్ష…

-ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జలవనరులశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష చేపట్టారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు నివేదించారు. పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం పనులు జులై 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా పనులు సాగుతున్నాయని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఇప్పటికే …

Read More »

గుంటూరు జిజిహెచ్ ఘటనపై స్పెషలిస్టు డాక్టర్ల కమిటీ నియామకం

-వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్)లో ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై తక్షణ విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన స్పెషలిస్టు డాక్టర్ల కమిటీని నియమించామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి . కృష్ణబాబు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని డిఎంఇ డాక్టర్ రాఘవేంద్రరావును ఆదేశించారు. చిన్నారి కను రెప్పపై ఏర్పడిన కణితిని …

Read More »

ప్రణాళిక ప్రకారం టిడ్కో గృహాలు పూర్తి చేయాలి…

-నిర్దేశించిన లక్ష్యం మేరకు అధికారులు పని చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం టిడ్కో గృహలకు ప్రాధాన్యత ఇస్తుందని, ప్రణాళిక ప్రకారం గృహాలను లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయం లో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో మంత్రి మాట్లాడుతూ జులై నాటికి 1లక్ష 50 వేల గృహాలను, డిసెంబర్ నాటికి 2.62 లక్షల గృహాలను తప్పనిసరిగా పూర్తి …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు. మే 21 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26న విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయని సీఎం జగన్‌కు వైవీ సుబ్బారెడ్డి వివరించారు. సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో టీటీడీ ఛైర్మన్‌ …

Read More »