Breaking News

Tag Archives: gannavaram

ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

-శాసనసభ్యులు సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. 52వ డివిజన్ కొత్తపేట లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మెట్లు, సైడ్ కాలువలకు రూ 19 లక్షలతో చేపట్టనున్న నిర్మాణం 53 వ డివిజన్ పరిధిలో సుబ్బరామయ్య వీధి నుండి హిందూ హైస్కూల్ వరకు రూ 62 లక్షలతో చేపట్టనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ …

Read More »

విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ కొత్త‌ టెర్మిన‌ల్స్ తొమ్మిది నెల‌ల్లో పూర్తి చేస్తాం: ఎం.పి కేశినేని శివ‌నాథ్

-గ‌న్న‌వ‌రం అభివృద్ది క‌మిటీ స‌మీక్షా స‌మావేశం -స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు -గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో విమానాశ్ర‌య అభివృద్ది శూన్యం -నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ -కొత్త టెర్మిన‌ల్ నిర్మాణ ప‌నుల‌పై వారం వారం స‌మీక్ష‌ గ‌న్న‌వరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావ‌తి రాజ‌ధాని లో వున్న ఏకైక ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ ను గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్లుగా అభివృద్ది చేయ‌కుండా కొత్త‌ టెర్మిన‌ల్ ప‌నులు అటకెక్కించింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్ఫూర్తిగా తీసుకుని కొత్త టెర్మిన‌ల్ ను …

Read More »

రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడలు తీర్చిదిద్దుతాం-పరిశ్రమల మంత్రి టీజీ భరత్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అతిపెద్ద పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం మంత్రి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి గన్నవరం మండలం మల్లవల్లి, బాపులపాడు మండలం వీరపనేని గూడెం పారిశ్రామిక వాడలను సందర్శించి పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ …

Read More »

విజయవాడను ముంబైతో నేరుగా వాయు అనుసంధానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు విజయవాడను ముంబైతో నేరుగా వాయు అనుసంధానం చేసినట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎయిర్ ఇండియా 15.06.2024 తేదీ మొదలు A-320 విమాన ప్రయాణంతో ముంబై-విజయవాడ- రోజువారీ నాన్‌స్టాప్ విమానాలను ప్రారంభించింది. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ముంబై నుంచి సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ఈ విమానం విజయవాడ నుంచి రాత్రి 7.10 గంటలకు బయలుదేరి రాత్రి …

Read More »

2024 హాజ్ యాత్ర సక్సెస్

-2024 పవిత్ర హాజ్ యాత్ర సక్సెస్ అయిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర హాజ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. -2024 పవిత్ర హాజ్ యాత్ర సక్సెస్ మీట్ బుధవారం గన్నవరం ఈద్గా జామా మసీదు హాజ్ క్యాంపు నందు నిర్వహించారు. గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, చైర్మన్ హాజ్ ఆపరేషన్స్ శ్రీ హర్షవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర హాజ్ కమిటీ, వక్ఫ్ బోర్డ్, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో 2024 హాజ్ యాత్ర …

Read More »

హాజ్ యాత్రకు 3వ బృందం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 పవిత్ర హాజ్ యాత్రను హాజ్ కమిటీ సభ్యులు, దూదేకుల కార్పొరేషన్ ఎండి గౌస్ పీర్ బుధవారం తెల్లవారుజామున గన్నవరం ఈద్గా జామా మసీద్ హాజ్ క్యాంప్ వద్ద పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 48 మందితో మూడో బృందం ఈరోజు ఉదయం 7:10 గంటలకు విమానంలో జెడ్డా బయలుదేరి వెళ్లింది. వక్ఫ్ బోర్డ్ సీఈవో మరియు హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హాజ్ కమిటీ సభ్యులు హాజ్ యాత్ర శుభప్రదం కావాలని, యాత్రికులకు అభినందనలు …

Read More »

ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి ఇంటి కి వెళ్లి కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. బుధవారం ప్రత్తిపాటి అరుణకుమారి గన్నవరం నియోజకవర్గంలోని ప్రాంతాలలో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ తాను పోటీచేస్తున్న ‘ఆపిల్‌’ గుర్తుకి ఓటువేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి మౌళిక సదుపాయాల రూపకల్పనలో మరింత ముందుకు వెళతానన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలబడటానికి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటానన్నారు. ఒక …

Read More »

ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్న స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. శనివారం ప్రత్తిపాటి అరుణకుమారి గన్నవరం నియోజకవర్గంలోని ప్రాంతాలలో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ ఓటు శక్తివంతమైన ఆయుధమని దానిని సరైన వ్యక్తి ఓటువేసి గెలిపించాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పార్టీ పుట్టినప్పటినుంచి పనిచేశానని ఆ పార్టీలో దళితులకు స్థానం లేకుండా చేస్తున్నారని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న వారికి విలువలు లేవని కొత్తవారిని చేర్చుకొని పాతవారిని బయటికి పంపిస్తున్నారని ఆవేదనతో జాతికి …

Read More »

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో చర్చించిన కలెక్టర్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం గన్నవరం విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఇతర పోలీసు అధికారులు, విమానాశ్రయం భద్రత అధికారులతో ప్రధాని భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈనెల 8వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడ పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లు, కాన్వాయ్ , జిల్లా పరిధిలో ప్రధాని పర్యటించే రోడ్డు మార్గం జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కలెక్టర్ గన్నవరంలో సామాజిక ఆరోగ్య …

Read More »

జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు సూచించారు. 71-గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గన్నవరంలో జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. గన్నవరం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పార్లమెంటు, అసెంబ్లీలకు …

Read More »