Breaking News

2024 హాజ్ యాత్ర సక్సెస్

-2024 పవిత్ర హాజ్ యాత్ర సక్సెస్ అయిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర హాజ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది.
-2024 పవిత్ర హాజ్ యాత్ర సక్సెస్ మీట్ బుధవారం గన్నవరం ఈద్గా జామా మసీదు హాజ్ క్యాంపు నందు నిర్వహించారు.

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, చైర్మన్ హాజ్ ఆపరేషన్స్ శ్రీ హర్షవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర హాజ్ కమిటీ, వక్ఫ్ బోర్డ్, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో 2024 హాజ్ యాత్ర విజయవంతం అయిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హాజ్ కమిటీ వివిధ శాఖల అధికారులు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేసింది. వక్ఫ్ బోర్డ్ సీఈవో మరియు హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హాజ్ కమిటీ సభ్యులు సిఆర్డిఏ అదనపు కమిషనర్ అలీం భాష , దూదేకుల కార్పొరేషన్ ఎండి గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం ఎల్ కె రెడ్డి, ఎయిర్పోర్ట్ భద్రతాధికారులు డీఎస్పీలు వెంకటరత్నం, గుప్తా, జయ సూర్య, సెంట్రల్ హాజ్ కమిటీ సభ్యులు బిలాల్ అన్సారి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *