గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 పవిత్ర హాజ్ యాత్రను హాజ్ కమిటీ సభ్యులు, దూదేకుల కార్పొరేషన్ ఎండి గౌస్ పీర్ బుధవారం తెల్లవారుజామున గన్నవరం ఈద్గా జామా మసీద్ హాజ్ క్యాంప్ వద్ద పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 48 మందితో మూడో బృందం ఈరోజు ఉదయం 7:10 గంటలకు విమానంలో జెడ్డా బయలుదేరి వెళ్లింది. వక్ఫ్ బోర్డ్ సీఈవో మరియు హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హాజ్ కమిటీ సభ్యులు హాజ్ యాత్ర శుభప్రదం కావాలని, యాత్రికులకు అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News