Breaking News

అనధికార హోర్డింగ్ లను తీసేయండి

-ఏజెన్సీకీ ఇచ్చిన గడువు పూర్తయితే, స్ట్రక్చరల్ స్టెబిలిటీ లేని హోర్డింగ్ లను తీసేయండి
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం నాడు ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో ఉన్న మీటింగ్ హాల్ నందు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు ప్లానింగ్ సెక్రటరీస్ తోసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ గత సమావేశంలో ప్లానింగ్ సెక్రటరీ లకి ఆదేశాల మేరకు 224 ఖాళీ హోర్డింగ్ ఫ్రేమ్లను తీసేసారని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ప్లానింగ్ సెక్రటరీలకు అనధికార హోర్డింగ్లను తీసేయాలని, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ కోసం నోటీస్ ఇచ్చి, పది రోజుల గడువు అయిపోయిన, ఇంకా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ లేని ఏజెన్సీ హోల్డింగ్లను తీసేయాలని బిల్డింగ్ ఆఫీసర్లకు, సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ జీవీ జీఎస్ వి ప్రసాద్, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చీరన్ రాయ్, బి వో లు, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *