-ఆంధ్రప్రదేశ్ భూ క్రమబద్ధీకరణ పథకం-2025 కింద 71 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, 31 మందికి పోసిషన్ సర్టిఫికెట్లు పంపిణీ -మంత్రి నారా లోకేష్ చొరవతో జీఓ-30 ద్వారా పేదలకు శాశ్వత హక్కులు -రిజిస్ట్రేషన్ ఖర్చులను సైతం భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -గన్నవరం తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 5 కోట్ల కేటాయింపు -కేసరపల్లిలో త్వరలో హెచ్‌సీఎల్ (HCL) ఏఐ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తాం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తన …
Read More »Tag Archives: gannavaram
చినఅవుటపల్లి డాక్టర్ సి.శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ కళాశాలలో ఘనంగా ‘ప్రిన్సిపల్స్ మరియు చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్’ రాష్ట్ర స్థాయి సమావేశం
-ముఖ్య అతిథిగా హాజరైన గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు -సమాజ ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర కీలకమని, ఆరోగ్య వ్యవస్థకు నర్సులు వెన్నెముకలాంటివారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లిలో డాక్టర్ సి.శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రిన్సిపల్స్ & చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్’ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య …
Read More »చదువు జీవితాన్ని మార్చే శక్తి.. కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు : విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి గన్నవరం బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు . మాజీ సర్పంచ్ పాలడుగు వెంకట వరప్రసాద్ (నాని) సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. …
Read More »గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం : ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు
హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని పీవీ & ఏకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో సుమారు రూ.1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు. ఈ లోసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వేలేరు గ్రామంలో ఈ రోడ్డు …
Read More »గన్నవరం బస్టాప్‌లలో బస్సులు ఆగకపోవడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీరియస్
-ప్రతి బస్టాప్‌లో బస్సులు తప్పనిసరిగా ఆపాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం శాంతి థియేటర్ సమీపంలో బస్సు షెల్టర్ లేకపోవడం, అలాగే బస్సులు నిర్దిష్ట బస్టాప్‌లలో ఆగకపోవడం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తక్షణమే స్పందించారు. ఇటీవల వచ్చిన వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న ఆయన, అన్ని బస్టాప్‌లలో బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు …
Read More »గన్నవరంలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు
-ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ -మర్లపాలెంలో రూ.74 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు గన్నవరం నియోజకవర్గం మర్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం …
Read More »గుడిమల్లం పరశురామేశ్వర స్వామి మహా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని ప్రసిద్ధ శ్రీ ఆనందవల్లీ సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామి ప్రసాదాలు …
Read More »సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌లలో సచివాలయాల పనితీరు, సిబ్బంది గైర్హాజరు, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యంపై ప్రజల నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం రామవరప్పాడు-1, 2, 3, ప్రసాదంపాడు-2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ తనిఖీలలో సచివాలయ వ్యవస్థలోని లోపాలను ఆయన గుర్తించారు. తనిఖీ సమయంలో పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరు కావడాన్ని ఎమ్మెల్యే …
Read More »అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టాలి… : ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం , నేటి పత్రిక ప్రజావార్త : బాపులపాడు మండలం మడిచర్ల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన, మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు …
Read More »గన్నవరం పాలిటెక్నిక్‌లో 100% ప్లేస్‌మెంట్లు: 132 మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవం, జాబ్ అచీవర్స్ డే కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాలలో నాలుగు విభాగాలకు చెందిన మొత్తం 132 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడంతో 100 శాతం ప్లేస్‌మెంట్లు నమోదయ్యాయి. గతంలో కొన్ని బ్రాంచ్‌లకు పరిమితమైన అవకాశాలు ఉండగా, …
Read More »
Prajavartha Online Telugu News