గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ విశాఖపట్నం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రమణ్యం తదితరులు చిరాగ్ పాశ్వాన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కేంద్ర మంత్రికి వారు ప్రజాప్రతినిధులు, అధికారుల తరఫున ఆత్మీయంగా స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా మాట్లాడారు.
Prajavartha Online Telugu News