Breaking News

యోగా దినోత్సవ షెడ్యుల్ అమలు పై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థలోని ప్రతి వార్డు సచివాలయం పరిధిలో సుమారు 7 వందల మంది యోగా శిక్షణ పొందేలా కార్యాచరణ రూపొందించామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో యోగా దినోత్సవ షెడ్యుల్ అమలు పై సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా జూన్ 7 నుండి 9 వరకు వార్డు సచివాలయ పరిధిలో, 10 నుండి 12 వరకు నగర పాలక సంస్థ పరిధిలో, 18 నుండి 20 వరకు జిల్లా స్తాయిలో యోగా పోటీలు జరుగుతాయన్నారు. యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో గుంటూరు నగర పాలక సంస్థ సచివాలయాల పరిధిలో ఎక్కువ మందికి అవగాహన కలిగించేలా శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక శిక్షకులను, స్తలాలను కూడా సిద్దం చేస్తున్నామన్నారు. అలాగే ఈ నెల 18వ తేదీన ఇంజనీరింగ్ విధ్యార్ధులతో జిల్లా స్తాయి కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున నగర ప్రజలు, అందుబాటులోని సచివాలయాల్లో జరిగే యోగా పోటీల్లో పాల్గొనాలని కోరారు.
సదరు సమావేశం నందు అదనపు కమిషనర్ సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాస్, సిటీ ప్లానర్ రాంబాబు, యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, యం హెచ్ ఓ డాక్టర్ సురేష్, పి.ఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *