Breaking News

గన్నవరం నియోజకవర్గం లో మహానాడు 2026 కోసం భారీ ఏర్పాట్లు

-నియోజక వర్గ వ్యాప్తంగా 11 చోట్ల స్క్రీన్ లు సిద్ధం చేసిన నాయకులు
-ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మహానాడు సన్నాహక సమావేశం
-ప్రతి కార్యకర్త మహానాడును తమ ఇంటి పండుగలా భావించి విజయవంతం చేయాలని పిలుపు
-నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో జరిగే కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు భోజన, తాగునీటి వసతులు సిద్ధం చేయాలని ఆదేశం
-గత 44 ఏళ్లుగా ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా మహానాడును నిర్వహిస్తున్నామని గుర్తు చేసిన ఎమ్మెల్యే
-చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహానాడు వేడుకలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో క్లస్టర్ వ్యవస్థ పాత్ర అత్యంత కీలకమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. మహానాడు గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ మండవ మోహన కృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులతో కలిసి విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా ఈ ఏడాది మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త దీనిని తమ ఇంటి పండుగలా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో జరిగే మహానాడు కార్యక్రమాలకు హాజరయ్యే కార్యకర్తలు, అభిమానులకు భోజన వసతులు, తాగునీరు వంటి సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్పించాలని నేతలకు సూచించారు. గ్రామ స్థాయిలో ఉన్న ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసి అందిస్తే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత 44 ఏళ్లుగా ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడు నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చి పేదలకు, బీసీలకు గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్యాంక్ ప్రెసిడెంట్లు, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ మహానాడు కార్యక్రమ పరిశీలకులు, ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, గొడ్డళ్ల చిన్న రామారావు, కొలుసు రవీంద్ర, గూడపాటి తులసిమోహన్, ఎన్.ఎస్.పి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, బొప్పన హరికృష్ణ, పుట్టా సురేష్, కోనేరు సందీప్, క్లస్టర్ ఇంచార్జీలు గుజ్జర్లపూడి బాబురావు, కొల్లా ఆనంద్, అడుసుమిల్లి నవీన్, అన్నే హరికృష్ణ, బండి భాస్కర్, కలపాల కుమార్, కొమ్మారెడ్డి రాజేష్, పరుచూరి నరేష్, పట్టపు చంటి, అట్లూరి శ్రీనివాసరావు, మొవ్వ వేణుగోపాల్, నబిగాని కొండయ్య, పోలిశెట్టి రమణ, సర్నాల బాలాజీ, యనమదల సతీష్, కొసరాజు సాయి, బొమ్మసాని దుర్గారావు, కొల్లూరు చంద్రకాంత్, కలపాల సూర్యనారాయణ, చల్లగుల్ల సందీప్, ఇజ్జు రాము, సొంగా సంతోష్, విష్ణుబొట్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *