-ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్. ఆయనతో పాటు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.
Read More »Tag Archives: hydarabad
పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలి
-డాక్టర్లు ప్రాణదాతలతో సమానం… రోగిని ప్రేమతో ఆదరించాలి… -చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అందరికి ఆధునిక వైద్యం అందించాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. గురువారం నాడు కూకట్ పల్లి, జి హెచ్ ఎం సి పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసిన చిరంజీవి హాస్పిటల్స్ (వాస్కులర్ మరియు మల్టీస్పెషలిటీ) ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ నేడు వైద్యం ఎంతో ఖరీదైనదని, పేదలకి …
Read More »కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతా… : బండి సంజయ్
కరీంనగర్, నేటి పత్రిక ప్రజావార్త : కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దేందుకు నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో పార్టీలకతీతంగా కరీంనగర్ మేయర్ తోపాటు కార్పొరేటర్లు బండి సంజయ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి సన్మానిస్తారని నేను ఊహించలేదన్నారు. ఇదే కార్పొరేషన్ లో నేను రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేశానని గుర్తు చేశారు. కార్పొరేటర్లంతా అభివృద్ధికి పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్ కు …
Read More »జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన విషయం …
Read More »పరీక్షా పే చర్చ 2024కి సంబంధించి దేశవ్యాప్తంగా పెయింటింగ్ పోటీలో పాల్గొన్న 60,000 మంది విద్యార్థులు
-పరీక్షా పే చర్చ 2024కు 2.26 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి -ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రధానమంత్రితో సంభాషించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో విస్తృతమైన ఉత్సాహం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : పరీక్షా పే చర్చ 2024కి ముందు విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా 774 జిల్లాల్లోని 657 కేంద్రీయ విద్యాలయాలు మరియు 122 నవోదయ విద్యాలయాల్లో (ఎన్‌విఎస్) జనవరి 23న చిత్రలేఖన పోటీని నిర్వహించడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రచించిన బుక్ ఎగ్జామ్ వారియర్స్ నుండి పరీక్ష మంత్రాలతో …
Read More »మెగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టుల భర్తీ : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సూచించారు. విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. రాష్ట్రంలో బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని.. విద్యార్థులు లేరని మూసివేసిన బడులను మళ్లీ తెరిపించాలని ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను …
Read More »పవన్ కళ్యాణ్ తో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. ఈ సమావేశంలో వర్తమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ పొలిటికల్ …
Read More »రత్నాకర్ దర్శకత్వం లో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ఆదివారం మాదాపూర్ లోని జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైనది. ముఖ్య అతిధిగా ఆ నలుగురు చిత్ర నిర్మాత ప్రేమకుమార్ పట్రా ముఖ్యఅతిథిగా పాల్గొని నటీనటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో రత్నాకర్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారని వెన్నెలొచ్చింది చిత్రం ద్వారా …
Read More »సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
-తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రె ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు -సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుక సికింద్రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా ఈరోజు అనగా తేదీ 15 జనవరి 2023న జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ …
Read More »హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఏపి సిఎం క్యాంప్ కార్యాలయంలో జెండా వందనం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఏపి సిఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, పరిశ్రమలు వాణిజ్య సలహాదారు లంకా శ్రీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పథకాలు …
Read More »