Breaking News

Tag Archives: narasaraopeta

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలి… : మోటూరి శంకర్ రావు

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అభ్యర్దిత్వాన్ని బలపరచాలని ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు విన్నవించారు. నరసరావుపేటలోని జిల్లా టిడిపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మోటూరి శంకరరావు మాట్లాడుతూ 15 సంవత్సరాలు సర్వీస్‌ చేసిన ప్రతి మాజీ సైనికులు కూడా, శాసనమండలి ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు కావున, ప్రతి ఒక్క మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని …

Read More »

కులగణన డిమాండ్‌తో విజయవాడలో అక్టోబర్‌ 9న బీఎస్పీ మహాధర్నా

-పల్నాడులో 77 ఏళ్ళ ఎన్నికల్లో కేవలం ఐదుగురు బీసీ ఎమ్మెల్యేలు ఇది దారుణం -చట్టసభల్లో, నామినేటెడ్‌ పదవుల్లో బీసీ కోటా తేలాలంటే ముందుగా కులగణన జరపాలని డిమాండ్‌ -రిటైర్డ్‌ డీజీపీ & బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్‌ డా. పూర్ణచంద్రరావు నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి ఇప్పటికి ఏపీలో 16 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 2,902 మంది ఎమ్మెల్యేలు అయితే, జనాభా దామాషా ప్రకారం బీసీలు దాదాపు 1,450 మంది అవ్వాలి. కానీ కేవలం 550 మంది మాత్రమే బీసీలు …

Read More »

ఈనెల 26 నుండి 28 వరకు వైభవంగా ఇస్సపాలెం అమ్మవారి తిరునాళ్ల..

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి సమీపంలో ఉన్న ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ల 49 వ మహోత్సవాలు ఈనెల 26 నుండి 28 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాలయము నందు ప్రతిరోజు విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యరాధన, అఖండ దీపారాధన, కుంకుమార్చన, ధ్వజారోహణ, నీరాజన మంత్రపుష్పార్చన , దీక్షాధారణ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మొదటి రోజున నరసరావుపేట పట్టణంలో మహిళల కోలాట ప్రదర్శనతో అమ్మవారి ఊరేగింపు, రెండవ రోజున అమ్మవారికి పొంగళ్ళు …

Read More »

ఓటే ఆయుధంగా యువత ఉద్యమించాలి

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికల్లో 50% ఓటింగ్ కల యువత చైతన్యంతో ఓటే ఆయుధంగా ఉద్యమించాలి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ  సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డీ లక్ష్మణరెడ్డీ పేర్కొన్నారు. ఈ నెల 3వ తేది నరసరావు పేటలోని పెరడైజ్ ఫంక్షన్ హాల్లో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం  అంశంపై జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉందని, ఓటర్ల దొంగలు ఉన్నారని, అధికార యంత్రంగా అధికార పార్టీ నేతలకు తొత్తులుగా …

Read More »

పల్నాడు శివారు గ్రామాల్లో మొబైల్ టవర్లు

-అవగాహనా సదస్సులో అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎం.ఎస్. ప్రసన్న కుమార్ నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : సిగ్నల్స్ లేని పల్నాడు జిల్లా శివారు గ్రామాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు గుంటూరు టెలికం జిల్లా సేల్స్, మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎం.ఎస్. ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలోని ఎర్రాప్రగడ టెలికాం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వినియోగదారుల అవగాహనా సదస్సులో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో …

Read More »

రెండో విడత నవోదయం కార్యక్రమం…

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో శుక్రవారం నాడు ఎస్సీ, ఎస్టీ ల అభ్యున్నతి కోసం , విద్య, ఉపాధి, వ్యాపారం మరియు ఇతర సమస్యల పరిష్కారానికై రెండో విడత నవోదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తోటి మరియు జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొని అర్జీలను స్వీకరించారు. డివిజన్ల వారీగా మరియు జాబ్ మేళా ద్వారా అర్జీలను స్వీకరించారు. రెండవ విడత …

Read More »

గడపగడపకు సంక్షేమమే మన లక్ష్యం ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి, ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వాంన్నే కార్యక్రమంలో భాగంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం రుస్తుంబాధ గ్రామంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు తో ఏపీ సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, ప్రముఖ నాయకులు అధికారులు పార్టీ అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

“మానవఅక్రమ రవాణా- నిరోధంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల పాత్ర”

నరసరావుపేట,  నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లాలో మానవ అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి ” జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్” కృషిచేస్తుందని ఇందుకై జిల్లాలోని మహిళా సంరక్షణ కార్యాదర్సుల పాత్ర చాలా ముఖ్యమని జిల్లా మానవ అక్రమ రవాణా ఇంచార్జి విజయకృష్ణ అన్నారు. నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో రూరల్ పోలీసుస్టేషన్ లోని సమావేశ మందిరంలో హెల్ప్ సంస్ధ మరియు జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ ఆధ్వర్యంలో ” మానవఅక్రమ రవాణా- నిరోధంలో మహిళా …

Read More »

కోటప్పకొండలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం…

-త్రికోటేశ్వర స్వామి పాదాల చెంత కొలువుదీరిన నందీశ్వరుడు -పల్నాడుకి మణిహారం లాంటి కోటప్పకొండ అభివృద్ధి మా లక్ష్యం : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి  నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : మహశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరుణాళ్లను పురస్కరించుకుని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోటప్పకొండపై అద్భుత ఘటం ఆవిష్కృతమైంది. పరమేశ్వరుడి దర్శించుకునే ముందు నందిశ్వరుడిని దర్శించుకోవాలని ప్రతితి. అందుకు అణుగుణంగా కొండపైనే త్రికోటేశ్వర స్వామి చెంత 12 అడుగుల ఎత్తుతో ఎకశిలా నంది విగ్రహం ప్రతిష్టా …

Read More »