నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్దిత్వాన్ని బలపరచాలని ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు విన్నవించారు. నరసరావుపేటలోని జిల్లా టిడిపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మోటూరి శంకరరావు మాట్లాడుతూ 15 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి మాజీ సైనికులు కూడా, శాసనమండలి ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు కావున, ప్రతి ఒక్క మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జీవో నెంబర్ 57-2001 ప్రకారం మాజీ సైనికులు అందరూ తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రకారం ఓటు హక్కును వినియోగించుకుని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆలపాటి రాజాని గెలిపించుకోవడం ద్వారా మన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుంది కావున మన సమస్యలు పరిష్కరించే మనిషిని మనం గెలిపించుకోవాలి అన్నారు. ఈ సమావేశంలో బి.సీతాదేవి మహిళా ప్రెసిడెంట్, ఎంసికె రావు అపెక్స్‌ఎస్‌ఎం గుంటూరు జిల్లా ప్రెసిడెంట్, ఎ.అప్పారావు పల్నాడు జిల్లా అపెక్స్‌ఎస్‌ఎం ప్రతినిధి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News