Breaking News

Tag Archives: tirumala

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

-కుటుంబ సమేతంగా వెంకటేశ్వరుని సేవలో ఎమ్మెల్యే తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, కుమార్తె – అల్లుడు శీలం కృష్ణప్రభ-అశ్విన్ కుమార్ దంపతులు, కుమారుడు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ దంపతులు తిరుమలేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వారి వెంట మనుమరాండ్రు పాల్గొన్నారు.

Read More »

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు, ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి

తిరుమల, నవంబర్ 13: నేటి గురువారం ఉదయం రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల గృహాలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ గృహవాసులందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెట్టుబడులు సమకూర్చడం, ప్రతి …

Read More »

శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో జరిగిన శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల చివరి రోజు జరిగిన చక్రస్థానం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ఈ దివ్యోత్సవం సజావుగా నిర్వహించిన టిటిడి అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Read More »

వాహన బేరర్లకు రూ.లక్ష రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు చిత్తూరు జిల్లా అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వాహనాలను మోసే వాహన బేరర్లకు రూ.లక్ష రూపాయలను బ్రహ్మోత్సవ బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…“గత 13 సంవత్సరాలనుండి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో వాహన బేరర్లకు లక్ష రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానంగా ఇస్తున్నాం. …

Read More »

శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్న తుడా చైర్మన్, బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి తనకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వాహనం ముందు అశ్వ, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారి వాహనసేవ అత్యంత వేడుకగా జరిగింది. ఈ వాహన సేవలో తుడా చైర్మన్, టీటీడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా …

Read More »

శ్రీవారి గరుడసేవ ఏర్పాట్లను పరిశీలన

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి గరుడసేవ నిమిత్తం భారీగా భక్తులు విచ్చేసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ సి.ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టిటిడి సివి & ఎస్‌ఓ మురళీకృష్ణ, ఐపీఎస్ తిరుమలలో సంయుక్తంగా పర్యటించారు. ఔటర్ రింగ్ రోడ్లు, నాలుగు మాడ వీధులు సహా ప్రధాన ప్రాంతాలను తిరిగి, భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, క్రమశిక్షణతో క్యూలైన్లు నిర్వహించాలి అని సూచనలు ఇచ్చారు. …

Read More »

తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం

-భక్తుల రద్దీ, క్యూలైన్ నిర్వహణ సహా పర్యవేక్షణకు సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ -ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల కోసం నిర్మించిన నూతన వసతి సముదాయం వేంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు. ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ కాంప్లెక్సు-5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి …

Read More »

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం ప్రపంచం మొత్తం చాటాలి

-5 వేల వేంకటేశ్వర దేవాలయాలు నిర్మించాలి -దేశంలోని ప్రతి రాజధానిలో, ప్రపంచంలో తెలుగు వారున్న ప్రతిచోట శ్రీవారి ఆలయం ఉండాలి -టీటీడీ నిర్వహణలో ఉన్న అన్ని దేవాలయాల్లో అన్నదానం చేపట్టాలి -టీటీడీ పాలక మండలికి సీఎం చంద్రబాబు సూచనలు -బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడుకొండలవాడికి 14వ సారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం ప్రపంచం మొత్తం చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రపంచంలోని తెలుగు వారున్న …

Read More »

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ …

Read More »