విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఉన్న నూరాని మసీదును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ సందర్శించి ముస్లిం సోదరులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భీమిశెట్టి ప్రవల్లిక, 4వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి వేసిపోగు వరుణ్ కాంత్‌తో పాటు నగర మేయర్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. కార్పొరేటర్ అభ్యర్థులకు, నగర మేయర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా నూరాని మసీదుతో నెహ్రూ గారి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దేవినేని అవినాష్ గుర్తుచేసుకున్నారు.ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
విజయనగర్ కాలనీలోని నూరాని మసీదులో ముస్లిం సోదరులతో ఆత్మీయంగా కలిసిన దేవినేని అవినాష్
