-కళలకు ఎప్పటికీ చావు లేదు – బాలకృష్ణ.
-కూచిపూడి, కొండపల్లి బొమ్మలు కృష్ణా జిల్లాకు సాంస్కృతిక గుర్తింపు.
-దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి – బాలకృష్ణ.
-పేదలకు అందుబాటులో ఆరోగ్య సేవలే మా లక్ష్యం – బాలకృష్ణ..
-అమరావతిలో త్వరలో హాస్పటల్ నిర్మాణం పూర్తి చేస్తాం – బాలకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఉత్సవ్ లో భాగంగా శనివారం రాత్రి గొల్లపూడి ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కిక్కిరిసిపోయింది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అద్భుతమైన వెలుగుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనలతో ఎగ్జిబిషన్ వేదిక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ విజయవాడ సినిమాలకు రాజధాని. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో తరాల కృషి ఉంది. కళలకు ఎప్పటికీ చావు లేదు. నేటి తరానికి కలలను, సాంప్రదాయాలను చాటి చెప్పడం మనందరి బాధ్యత. కూచిపూడి నృత్యం, కొండపల్లి బొమ్మలు కృష్ణ జిల్లాలో సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తున్నాయి” అన్నారు. ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన ఈ సభలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి. 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా 11 రోజులు దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరించడం ప్రత్యేకత అని తెలిపారు. బసవతారకం హాస్పటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాము. త్వరలో అమరావతిలో హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాము. పేదలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందించడం మా లక్ష్యం. అమరావతికి బ్రాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆయన అనుభవంతో ఆర్థిక సమస్యలను అధిగమించి, రాష్ట్రాన్ని దేశ పటంలో సువర్ణ అక్షరాలతో నిలబెడతారు” అని నమ్మకం వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవ్ ను కన్నుల పండువగా నిర్వహిస్తున్న కమిటీ ఛైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లకు అభినందనలు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పటల్ ద్వారా ఇప్పటికీ ఎంతో మంది సేవలు పొందుతున్నారు. అమరావతిలో కొత్త హాస్పటల్ నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే పేదలకు మరింత మంచి వైద్యసేవలు అందుతాయి. బాలకృష్ణకు నేషనల్ అవార్డ్ రావడం ఆనందకరం. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, “ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన వెంటనే 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతులు భూములు ఇవ్వడం నిజంగా అభినందనీయం. మైలవరం నియోజకవర్గం త్వరలో గ్రేటర్ విజయవాడలో కలుస్తుంది. దీంతో గొల్లపూడి మరింత అభివృద్ధి చెందుతుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో విజయవాడ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది” అని వివరించారు. కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, సినీ నిర్మాత అంబికా కృష్ణా, స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఏఏంసీ చైర్మన్ నర్రా వాసు, కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, చిట్టిబాబు, ఎస్.శ్రీనివాస్, ఎన్ఆర్ఐ వల్లభనేని గిరి, చెరుకూరి రాజేశ్వరరావు, విజయబాబు, ఎంఎస్ బెగ్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News