Breaking News

శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించికున్న మంత్రి అనిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రులు సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రిపై వెలసిన  కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. క్యూలైన్ల ఏర్పాట్లు, త్రాగునీటి సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి, భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులు ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *