Breaking News

పన్నులను సకాలంలో చెల్లించాలి …

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలో దీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించని వారి నివాస గృహాలు మరియు వ్యాపార సంస్థలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సుమారు 36 నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్ను బకాయిలపై ఇప్పటికే నోటీసులు, స్లిప్స్ పంపిణీ, మెసేజ్ లు పంపి అవగాహన కల్గించినా కొందరు చెల్లించడంలేదన్నారు. ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్న, వాటర్ మీటర్ చార్జీలు మరియు ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. పన్ను బకాయిలు చెల్లించని వారి ట్యాప్ కనెక్షన్ల తో పాటు డ్రైనేజి కనెక్షన్ తొలగిస్తామని, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చంద్రబాబు నిరంతర కృషి ఫలితం… సంక్షోభంలోనూ తెలుగు వారిని కాపాడిన కూటమి ప్రభుత్వం

-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాట ఇచ్చామంటే చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *