విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు గాను మైలవరం మండలం గణపవరం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ద్వారావతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి గాను దాతలు నుండి విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా మైలవరం లోని లక్కీ రెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం మహా రుద్రాభిషేకం నిర్వహించినట్టు చెప్పారు. ఆసుపత్రి నిర్మాణానికి చలవాది మల్లికార్జున రావు స్థలాన్ని దానం చేశారన్నారు.