Breaking News

అసంక్రమిత వ్యాధుల సర్వే పక్కాగా గడువులోపు పూర్తి చేయాలి

-పాఠశాలల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాలు పాఠశాల తెరిచెలోపు పూర్తి కావాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా జవహర్ రెడ్డి
-స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో అర్థవంతంగా నాణ్యతగా పరిష్కరించాలి
-సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై దృష్టి పెట్టండి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల, గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు శ్రద్ధ చూపాలని , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ధ్యేయంగా పనిచేయాలని, స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.గురువారం మధ్యాహ్నం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో పాఠశాల విద్య ,మహిళా శిశు సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన అంశాలపై సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.సి ఎస్ సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.0-5 సంవత్సరాల చిన్నపిల్లల ఆధార్ నమోదును వేగవంతం చేయాలని, డుప్లికేట్ ఆధార్ నమోదు లేకుండా చూడాలని, ఆధార్ అప్దేషన్ నిబంధనల మేరకు జరిగేలా ఉండాలని సూచించారు. అంగన్వాడీ వర్కర్స్, ఏ ఎన్ ఎం వారు నిర్వహిస్తున్న బెనిఫిషరీ ఔట్ రీచ్ సర్వే లో అనీమియా తో బాధ పడుతున్న 0-5 సం. ల పిల్లలు, కౌమార దశలో అమ్మాయిలు 10-19 సం. వారు, 15-49 సం. ల గర్భిణీలు, స్టంటేడ్ పిల్లలు, ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లల ను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి సమాచారంలో తేడా లేకుండా ఒకే సమాచార వ్యవస్థ ఏర్పడేలా సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు.అసంక్రమిత, సంక్రమిత వ్యాధుల సర్వే వేగవంతం చేయాలనీ, వైద్య రంగంలోని అంశాలలో పురోగతి మెరుగుపడాలి అని, వైద్య అధికారులు వారికి సంబంధించిన హెల్త్ పారామీటర్ లలో లక్ష్యాలు అంది పుచ్చుకోవాలి అని అన్నారు. అర్బన్ హెల్త్ మిషన్ లో ముందుగా వైద్యాధికారుల ఖాళీలను భర్తీ చేసి మిగిలినవి అనంతరం భర్తీ చేపట్టాలని అన్నారు.పిల్లల ఆరోగ్యం ప్రధానంగా అనీమియా తో బాధ పడుతున్న పిల్లలకు, ఎత్తు తక్కువ ఎదుగుదల లోపం గల పిల్లలకు అంగన్ వాడి నుండి చిక్కీలు, పాలు, గుడ్లు, సంపూర్ణ పోషణ, గర్భిణి స్త్రీల లో పోషకాహార లోపం తగ్గించడానికి అవసరమైన ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ, వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ సక్రమంగా అందేలా సచివాలయం పరిధిలో తరచూ పర్యవేక్షణ వుండాలని అన్నారు.బడి ఈడు పిల్లలు బడి లో ఉండేలా వచ్చే విద్యా సంవత్సరం లో వారు నమోదు అయ్యేలా చూడాలని సూచించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ లోని అంగన్వాడి కేంద్రాలలో భర్తీకి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని ఐ సి డి ఎస్ పి డి ని ఆదేశించారు.ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు పాస్ అయ్యే స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బడి బయట పిల్లలను గుర్తించి వారికి బ్రిడ్జ్ కోర్సు అందించి వచ్చే విద్యా సంవత్సరం లో రెగ్యులర్ పాఠశాలలలో చేర్చేల చర్యలు చేపట్టాలని అన్నారు. 5వ తరగతి పూర్తి అయిన వారిని 6వ తరగతి కి, 7వ తరగతి పూర్తి ఐన వారిని 8 లో చేర్పించాలని అన్నారు. నాడు నేడు పనులు, రిపేర్లు, పాఠశాలల్లో కరెంట్, ఫ్యాన్, బల్లల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోపు జూన్ లోపు పూర్తి చేయాలని అన్నారు. రోజువారీగా పురోగతి ఉండాలని, ప్రతి సోమవారం పురోగతిపై ఫోటోగ్రాఫ్ లు పంపాలని అన్నారు.స్పందనలో అందిన అర్జీలు సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని బియాండ్ ఎస్ ఎల్ ఎ వెళ్లరాదని అన్నారు. ఒక్క అర్జీ కూడా అర్థవంత పరిష్కారం జరగలేదని తిరిగి స్పందనలో రీ ఓపెన్ కారాదని సూచించారు.ఈ సమీక్షలో సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డి ఇ ఓ శేఖర్, పిడి ఐ సి డి ఎస్ జయలక్ష్మి, బి. సి. సంక్షేమ అధికారి భాస్కర్ రెడ్డి,జి ఎస్ డబ్ల్యు ఎస్ కోఆర్డనేటర్ జగదీష్, జిల్లా సామాజిక ప్రవర్తనా మార్పు కో ఆర్డినేటర్ కిషోర్ పాల్గొన్నారు.

Check Also

సీఎం చంద్రబాబు క్రైస్త‌వుల ప‌క్ష‌పాతి

-టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్త‌వ స‌మాధుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *